ఒక్క పెట్టుబడితో ఖర్చుల ప్లానింగ్ ఈజీ.. ఇప్పటి నుంచి ఇదే ఫాలో అవుతారు…

ఒక్కసారి పెట్టుబడి పెడితే, ప్రతి నెల రెగ్యులర్ ఆదాయం వస్తే ఎలా ఉంటుంది? అది కూడా ప్రభుత్వ ప్రోత్సహిస్తున్న స్కీమ్‌లో అయితే? ఇదే అవకాశాన్ని ఇస్తోంది పోస్టాఫీస్ లోని “మంత్లీ ఇన్కమ్ స్కీమ్” (MIS). ఇది విశ్వసనీయత ఉన్న స్కీమ్‌ కావడంతో దేశవ్యాప్తంగా చాలామంది ఇప్పటికే ఇందులో పెట్టుబడి పెడుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

వడ్డీ ఎలా?

ఈ స్కీమ్‌లో మీరు వేసే పెట్టుబడిపై ప్రతి నెల వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.4% వడ్డీ రేటు లభిస్తోంది. అంటే మీరు రూ.9 లక్షలు ఒక్కసారిగా వేస్తే, ప్రతి నెలా మీకు రూ.5,550 వడ్డీ వస్తూ ఉంటుంది. ఈ డబ్బును మీరు నెలకు, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు లేదా ఏడాదికి ఒకసారి తీసుకోవచ్చు – మీకు వీలైన విధంగా ఎంపిక చేసుకోవచ్చు.

ఎన్ని పెట్టాలి?

ఈ స్కీమ్‌ వ్యవధి మొత్తం 5 సంవత్సరాలు. అయితే ఒక ఏడాది పూర్తయ్యాక అత్యవసరం ఉంటే స్కీమ్‌ను మూసేసుకోవచ్చు. మీరు వ్యక్తిగత ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షలు పెట్టొచ్చు. ఒకటి కంటే ఎక్కువ మందితో కూడిన జాయింట్ అకౌంట్ అయితే, గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి చేయొచ్చు. అయితే మీరు ఎక్కువ ఆదాయం కోరుకుంటే పూర్తి రూ.9 లక్షలు పెట్టడం మంచిది.

Related News

ఈ స్కీమ్‌లో పెట్టిన డబ్బు పూర్తిగా సురక్షితం. 5 ఏళ్లలో ప్రతి నెలా రూ.5,550 లాభం వస్తుంది. మొత్తం 5 ఏళ్లలో వడ్డీ రూపంలో వచ్చే మొత్తం రూ.3,33,000. ఇక చివరికి మీరు పెట్టిన రూ.9 లక్షలు కూడా మళ్లీ మీ ఖాతాలోకి వస్తాయి. అంటే మొత్తం కలిపితే మీరు పొందేది రూ.12.33 లక్షలు అవుతుంది.

పోస్టాఫీస్ మన దేశంలో 250 ఏళ్లకు పైగా ప్రజలతో నడుస్తున్న సంస్థ. ఇప్పుడు ఇది బ్యాంకింగ్ సేవలు కూడా అందిస్తోంది. కొన్ని పోస్టాఫీస్ స్కీమ్‌లు బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇవ్వడమే కాకుండా, పూర్తిగా భద్రమైనవి కూడా. ఎలాంటి రిస్క్ లేకుండా నెల నెలా ఆదాయం కావాలంటే, ఈ Monthly Income Scheme తప్పక ట్రై చేయండి.