డిల్లీ-ఎన్‌సీఆర్‌లో 12 మాక్స్ హాస్పిటల్స్
మాక్స్ హాస్పిటల్‌కి డిల్లీ-ఎన్‌సీఆర్‌లో మొత్తం 12 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇందులో 8 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, 2 మల్టీ-స్పెషాలిటీ సెంటర్స్, గురుగ్రామ్‌లో ఒక హాస్పిటల్, లజ్‌పత్ నగర్‌లో ఒక కేన్సర్ కేర్ సెంటర్ ఉన్నాయి. కేర్ హెల్త్ ఇన్షూరెన్స్ వెబ్‌సైట్ ప్రకారం, “కస్టమర్ల అభ్యర్థనల అస్థిరత” కారణంగా, మాక్స్ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ క్లెయిమ్ సేవలను నిలిపివేశామని వెల్లడించారు.
ఈ మార్పు ఎక్కడ వర్తించదు?
ఈ సేవ రద్దు కేవలం డిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని మాక్స్ హాస్పిటల్స్‌కే పరిమితం. దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న మాక్స్ హాస్పిటల్స్‌లో మాత్రం ఇదే క్యాష్‌లెస్ క్లెయిమ్ సదుపాయం యథావిధిగా కొనసాగుతుంది. అందువల్ల, మీరు డిల్లీ-ఎన్‌సీఆర్ వెలుపల ఉన్న మాక్స్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటే, మీ ఇన్షూరెన్స్ ఆధారంగా క్యాష్‌లెస్ సదుపాయం పొందవచ్చు.
క్యాష్‌లెస్ క్లెయిమ్ అంటే ఏమిటి?
సాధారణంగా క్యాష్‌లెస్ క్లెయిమ్ సదుపాయం ఉన్నప్పుడు, ఇన్షూరెన్స్ పాలిసీదారుడు హాస్పిటల్ ఖర్చును స్వయంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇన్షూరెన్స్ కంపెనీ హాస్పిటల్‌తో నేరుగా బిల్లులు క్లెయిమ్ చేసి చెల్లిస్తుంది. కానీ ఇప్పుడు కేర్ హెల్త్ ఇన్షూరెన్స్ మాక్స్ హాస్పిటల్స్‌లో ఈ సదుపాయాన్ని నిలిపివేసింది.
Related News
ఇకపై పాలిసీదారులకు ఏం చేయాలి?
ఈ కొంతకాలం మాక్స్ హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తే, ముందుగా మీ ఖర్చును స్వయంగా చెల్లించాలి. ఆ తర్వాత ఇన్షూరెన్స్ కంపెనీ వద్ద రీయింబర్స్‌మెంట్ (Reimbursement) క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. రీయింబర్స్‌మెంట్ ప్రక్రియలో ఆలస్యం కావొచ్చు, అందుకే అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ ని సేకరించుకొని, అవసరమైన ప్రాసెస్ ముందుగానే తెలుసుకోవడం మంచిది.
ఇది ఎందుకు కీలకం?
డిల్లీ-ఎన్‌సీఆర్‌లోని మాక్స్ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ క్లెయిమ్ అందుబాటులో లేదు. మీరు మొదట మీ డబ్బుతో ట్రీట్మెంట్ ఖర్చు చెల్లించాలి. అప్పుడు మాత్రమే ఇన్షూరెన్స్ కంపెనీ మీ ఖర్చును తిరిగి చెల్లిస్తుంది. రిఈంబర్స్‌మెంట్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి. ఇతర నగరాల్లోని మాక్స్ హాస్పిటల్స్‌లో మాత్రం క్యాష్‌లెస్ సేవలు యథాతథంగా కొనసాగుతాయి.
ముందుగానే ప్లాన్ చేసుకోండి
మీరు మాక్స్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే, ముందుగా ఈ మార్పుల గురించి పూర్తిగా తెలుసుకోండి. అవసరమైన డబ్బు, డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడం ద్వారా, అక్కర్లేని ఇబ్బందులను తప్పించుకోవచ్చు.