2013 ఫిబ్రవరి 21న దిల్ సుఖ్నగర్ లో జరిగిన బాంబు పేలుళ్లలో 18 మంది మరణించగా, 130 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఉగ్రవాదులు టిఫిన్ బాక్స్ లో బాంబు అమర్చి పేలుళ్లను సృష్టించారు. ఈ బాంబు పేలుళ్ల కేసులో ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడు. ఈ కేసులో 157 మంది సాక్షులను విచారించిన ఎన్ఐఏ. 2016లో ఎన్ఐఏ కోర్టు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి మరణశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పుపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు.
అయితే, ఈ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు నేడు తీర్పు ప్రకటించనుంది. ఈ కేసులో యాసిన్ భత్కల్ ను కీలక సూత్రధారిగా ఎన్ఐఏ గుర్తించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, నిందితులు NIA కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేశారు. ఈ కేసులో వాదనలు ఇప్పటికే హైకోర్టులో ముగిశాయి. తెలంగాణ హైకోర్టు ఈరోజు తీర్పును ప్రకటించనుంది.
ఫిబ్రవరి 21, 2013న, దిల్ సుఖ్ నగర్ బస్ స్టాండ్ సమీపంలో కొన్ని నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగాయి. బస్ స్టాండ్ ఎదురుగా మొదటి బాంబు పేలిన కొద్దిసేపటికే, 150 మీటర్ల దూరంలో మరొక పేలుడు సంభవించింది. ఉగ్రవాదులు టిఫిన్ బాక్స్‌లో బాంబు అమర్చి ఈ దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్, జియా-ఉర్-రెహ్మాన్, తెహసీన్ అక్తర్ మరియు అజాజ్ షేక్ ఈ దాడిలో పాల్గొన్నారని NIA దర్యాప్తులో తేలింది. ఇది 157 మంది సాక్షులను విచారించి చార్జిషీట్ దాఖలు చేసింది.