New Delhi recorded an all-time high of 52.3 degrees Celsius . ఉత్తర భారతంలో భగభగలతో ప్రజలు అల్లాడుతున్నారు. దేశ రాజధాని Delhi లో చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. Delhi’s Mungeshpur లో రికార్డు స్థాయిలో 52.3 degrees Celsius నమోదైంది.
ఒకవైపు దక్షిణ భారతదేశంలో అక్కడక్కడా చెదురుమదురు జల్లులు పలకరిస్తుంటే.. ఉత్తర భారతంలో మాత్రం ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఊహించని విధంగా ఊహించని విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండల తీవ్రతకు Delhi తోపాటు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు Delhi లో నీటిని వృథా చేసే వారికి వేల రూపాయల జరిమానా విధిస్తున్నారు.
ఎండల తీవ్రత పెరగడంతో Delhi లో విద్యుత్ డిమాండ్ పెరిగింది. 8,302 మెగావాట్ల విద్యుత్ వినియోగించినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా, అనేక నగరాలు పాఠశాలలను మూసివేయవలసి వచ్చింది మరియు వేసవి సెలవులను మరిన్ని రోజులు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు .
ఆరుబయట పనిచేసేవారు వడదెబ్బకు గురవుతున్నారు. ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్లోని ఫలోడి పట్టణంలో 2016లో నమోదైన All Time Record వేడిని ఈరోజు నమోదైన temprature అధిగమించింది. అంతకుముందు 51 degree Celsius ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వేడిగాలులు వీస్తుండటంతో మూగజీవాలు తల దాచుకునేందుకు చోటులేక ఇబ్బందులు పడుతున్నాయి. దాహం, వేడి తగ్గే అవకాశం లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నాయి .