సామ్‌సంగ్ అభిమానులకు ఇది అసలు కన్‌ఫ్యూజన్ టైం. Galaxy S24 FE త్వరలో మార్కెట్‌లోకి రానుంది. ఇదే సమయంలో Galaxy S24 5G ఇప్పటికే అందుబాటులో ఉంది. ఒకదానికంటే మరొకటి తక్కువేమీ కాదు. కానీ ధరలో మాత్రం తేడా ఉంది. ఈ రెండు ఫోన్లు స్క్రీన్, పనితీరు, కెమెరా, బ్యాటరీ వంటి విషయాల్లో ఎలా ఉన్నాయి? ఏది నిజంగా మనకి విలువిచ్చే ఫోన్? ఇప్పుడు తెలుసుకుందాం.
డిజైన్ లో తేలికపాటి గెలుపు
Galaxy S24 5G చాలా స్లిమ్‌గా ఉంటుంది. దీని మందం కేవలం 7.6 మిల్లీమీటర్లు. బరువు కూడా 167 గ్రాములే. చేతిలో పటుగా, లైట్‌వెయిట్ ఫీల్ వస్తుంది. కానీ Galaxy S24 FE మాత్రం 8 మిల్లీమీటర్లు మందం, బరువు 213 గ్రాములు.
దీని రూపకల్పన బలంగా ఉంటుంది కానీ S24 5Gలో లా సౌకర్యంగా ఉండదు. రెండు ఫోన్లలోను గ్లాస్ బాడీ, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. అయితే స్లిమ్ డిజైన్, తేలికైన బరువుతో S24 5G డిజైన్ పరంగా ముందుంది.
Related News
డిస్‌ప్లే: చిన్నది కానీ శార్ప్
Galaxy S24 5Gలో 6.2 ఇంచుల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంటుంది. ఇది 2600 నిట్స్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, గోరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది. S24 FEలో మాత్రం పెద్దదైన 6.7 ఇంచుల AMOLED డిస్‌ప్లే ఉంది.
ఇది HDR10+ సపోర్ట్‌తో వస్తుంది కానీ బ్రైట్నెస్ మాత్రం 1900 నిట్స్ వరకు మాత్రమే ఉంటుంది. పిక్సెల్ డెన్సిటీ పరంగా చూస్తే S24 5Gలో 416ppi ఉండగా, FEలో 385ppi మాత్రమే. అందుకే షార్ప్‌నెస్, విజువల్ క్లారిటీకి S24 5G గెలుస్తుంది.
పెర్ఫార్మెన్స్: ఇద్దరిదీ సేమ్ లెవల్, కానీ చిన్న తేడాలు
ఇద్దరిలోనూ Exynos 2400 సిరీస్ ప్రాసెసర్లు వాడారు. Galaxy S24లో Exynos 2400, S24 FEలో 2400e వేరియంట్. రెండు ఫోన్లలోనూ 8GB RAM ఉంటుంది. కానీ S24లో 3.2GHz స్పీడ్, 256GB UFS 3.1 స్టోరేజ్ ఉంది.
ఇది ఆప్స్ ఓపెన్ చేయడంలో కాస్త వేగంగా ఉంటుంది. ఇక S24 FEలో 3.11GHz స్పీడ్, 128GB స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్‌ను ఎక్స్‌పాండు చేసుకునే ఆప్షన్ లేదు. ఎక్కువ గేమింగ్, మల్టీటాస్కింగ్ చేసే వాళ్లకు S24 మంచి ఎంపిక.
కెమెరా: కాస్త మెరుగైన ఫీచర్లు S24లో
ఇద్దరిలోనూ 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. అదనంగా 12MP అల్ట్రా వైడ్, S24లో 10MP టెలిఫోటో, S24 FEలో 8MP టెలిఫోటో ఉంటుంది. రెండు ఫోన్లు కూడా 8K వీడియో తీయగలవు. కానీ S24లో 30fpsలో షూట్ చేయవచ్చు,
FEలో మాత్రం 24fps మాత్రమే. సెల్ఫీ కెమెరా పరంగా S24లో 12MP, FEలో 10MP ఉంటుంది. డెయిలీ ఫోటోలు, వీడియోలకి ఇద్దరిదీ బావుంటాయి. కానీ జూమ్, వీడియో క్లారిటీ విషయంలో S24 ముందంజలో ఉంటుంది.
బ్యాటరీ: S24 FEలో ఎక్కువ లైఫ్
ఇక్కడ మాత్రం FE హీరోలా నిలుస్తుంది. Galaxy S24లో 4000mAh బ్యాటరీ ఉండగా, S24 FEలో 4700mAh ఉంటుంది. రెండింట్లోను 25W ఫాస్ట్ చార్జింగ్, 15W వైర్లెస్ చార్జింగ్, రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. కానీ ఎక్కువ బ్యాటరీ ఉన్నది FE కాబట్టి, గేమింగ్, వీడియోలు ఎక్కువగా చూసే వాళ్లకు దీన్ని బెటర్ అనచ్చు.
దేన్ని కొనాలి? లేదా ఏది బెటర్?
మీరు ఒక ఫ్లాగ్‌షిప్ ఫోన్ అనిపించేలా స్లిమ్ డిజైన్, బ్రిలియంట్ డిస్‌ప్లే, మెరుగైన కెమెరా, వేగవంతమైన పనితీరు కోరుకుంటే Galaxy S24 5G తప్పనిసరి. అది ఖర్చుతో కూడుకున్న ఎంపిక కానీ విలువ ఉంటుంది.
అయితే పెద్ద స్క్రీన్, ఎక్కువ బ్యాటరీ లైఫ్, ధరలో కొంచెం తగ్గిన ఫోన్ కావాలంటే Galaxy S24 FE మీ కోసం. ఇది ప్రాక్టికల్ ఎంపిక.
కాబట్టి, మీరు ఖరీదుపైన దృష్టి పెట్టినవారైతే FE సరిపోతుంది. కానీ బెస్ట్ ఫీచర్లతో ఫ్లాగ్‌షిప్ ఫీల్ కావాలంటే S24 5Gనే చూసేయండి. ఇప్పుడు తీసుకోకపోతే, తర్వాత మరింత ఖర్చవుతుంది.