Cyber Fraudsters: సైబర్ మోసగాళ్లు ఓ గృహిణి నుంచి రూ.31.60 లక్షలు పార్ట్ టైమ్ జాబ్ సాకుతో లాగేసారు. గోదావరిఖని సైబర్ క్రైం ఏసీపీ వెంకటరమణ కథనం ప్రకారం..
మంచిర్యాల్ జిల్లాకు చెందిన ఓ గృహిణి ఇన్‌స్టాగ్రామ్‌లో సైబర్ మోసగాళ్లకు పరిచయమైంది. ఆమెకు పార్ట్‌టైమ్ ఉద్యోగం ఇప్పిస్తామని, దాని ద్వారా డబ్బు సంపాదించేలా చేస్తామని హామీ ఇచ్చారు.
ఇందుకోసం ముందుగా ఆమెకు రూ. 10 వేలు డిపాజిట్‌గా చెల్లించాలి. అప్పుడు వారు రూ.13 వేలు ఆమె ఖాతాలో జమ చేశారు. ఆమె మళ్ళీ 10వేలు పంపిస్తే రూ. 18 వేలు ఆమె ఖాతాలో జమ చేశారు. అలా రూ.1 లక్ష వరకు పంపిన తర్వాత. లక్షల , టాస్క్ ప్రారంభమైందని, అది పూర్తయ్యే వరకు డబ్బులు పంపాలని చెప్పడంతో ఆమె రూ. 31.60 లక్షలు విడతల వారీగా ఇతర వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు జమ చేసింది.
Related News
ఆ తర్వాత ఉద్యోగం రాకపోవడంతో వారి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో మోసపోయానని గ్రహించి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ సీఐ కృష్ణకుమార్ హైదరాబాద్ మలక్ పేటలోని సోహెల్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న మహ్మద్ అవద్‌ను నిందితుడిగా గుర్తించారు.
అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన పేరిట మూడు బ్యాంకు ఖాతాలు తెరిచి ఇలియాస్ అనే వ్యక్తికి ఇచ్చానని, అందులో డబ్బు జమ చేసి తమ బ్యాంకుకు బదిలీ చేస్తానని చెప్పాడు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అసలు సైబర్ మోసగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.