పప్పు, కాయగూరలతో పాటు పెరుగు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొంతమంది పెరుగు బదులు మజ్జిగ తీసుకుంటారు. పాల ఉత్పత్తులను ఏ రూపంలో తీసుకున్నా కడుపులో మంచి బ్యాక్టీరియా పెరిగి పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పెరుగు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంటే..
చాలామందికి భోజనంలో పెరుగు లేకపోతే కడుపు నిండదు. పెరుగు లేకపోతే కొందరు మజ్జిగ తాగుతారు. పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు తినడం వల్ల శరీరానికి కాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి12 సమృద్ధిగా అందుతాయి. అయితే రాత్రిపూట పెరుగు తినడం అంత మంచిది కాదని కొందరు అంటున్నారు. ఇక్కడ నిజమెంతో తెలుసుకుందాం..
నిజానికి పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కాబట్టి మధ్యాహ్నం పూట తినడం మంచిది. పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాకు మేలు జరుగుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగులో క్యాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కండరాల నిర్మాణంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చుతుంది. జుట్టు కుదుళ్లను రక్షిస్తుంది.
Related News
అయితే రాత్రిపూట శరీరంలో జీవక్రియ మందగిస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు ఇలాంటి సమయంలో పెరుగు తింటే సమస్యలు ఎక్కువవుతాయి. పెరుగులో కొవ్వు మరియు ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. కాబట్టి, జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తింటే సమస్యలు పెరుగుతాయి. అలాగే దగ్గు, జలుబు, ఆస్తమాతో బాధపడేవారు రాత్రిపూట పెరుగు తినకపోవడమే మంచిది.
పెరుగును ఉదయం లేదా మధ్యాహ్నం తినవచ్చు. ఈ సమయంలో పెరుగు తినడం వల్ల జీర్ణం సులభంగా అవుతుంది. అయితే శ్వాసకోశ సమస్యలు లేని వారు రాత్రిపూట కూడా పెరుగు తినవచ్చు. అలాంటి సమస్యలు లేని వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెరుగు తినవచ్చు. అయితే పెరుగు కొవ్వు రహితంగా ఉంటే ఇంకా మంచిది.
బరువు తగ్గాలనుకునే వారు పెరుగు తినకూడదు. ఇందులో అధిక కొవ్వు పదార్థం ఉంటుంది. స్కిమ్డ్ మిల్క్‌తో చేసిన పెరుగు తినడం మంచిది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బరువు అదుపులో ఉండేందుకు ప్రయత్నించే వారు స్కిమ్డ్ మిల్క్‌తో చేసిన పెరుగు తినాలి. ఇలా పెరుగు తినడం వల్ల వారి బరువు అదుపులో ఉంటుంది.