మధ్యప్రదేశ్‌లో అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది! 10 నెలల క్రితం హత్యకు గురైన మహిళ మృతదేహం.. ఇటీవల ఒక గదిలోని ఫ్రిజ్‌లో లభ్యమైంది.
పోలీసులు కొన్ని గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేశారు.
ఇదీ జరిగింది..
Related News
ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని దివాస్ జిల్లాలో జరిగింది. గత ఏడాది జూన్‌లో సంజయ్ పాటిదార్ అనే వ్యక్తి ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారాడు. కానీ అతను ఇప్పటికీ పాత ఇంట్లో ఒక గదిని ఉపయోగిస్తున్నాడు. ఆ గది ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది.
ఆ ఇంట్లో మరికొందరు అద్దెకు ఉంటున్నారు. ఇంతలో, శుక్రవారం మధ్యాహ్నం నాటికి, తాళం వేసి ఉన్న గది నుండి దుర్వాసన రావడం ప్రారంభమైంది. బల్వీర్ రాజ్‌పుత్ అనే వ్యక్తి.. గది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. ఫ్రిజ్ తలుపు తెరిచిన తర్వాత, అతను షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు గది ఫ్రిజ్‌లో ఒక మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు.
“గది నుండి దుర్వాసన వస్తోందని తెలియగానే మేము వెళ్ళాము. గదిలో ఒక మృతదేహం కనుగొనబడింది” అని దివాస్ ఎస్పీ పునీత్ గెహ్లాట్ అన్నారు.
మృతురాలి పేరు ప్రతిభా పాటిదార్ అని, ఆమె సంజయ్ పాటిదార్ తో లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడు గత ఏడాది మార్చిలో ఆ మహిళను హత్య చేశాడని వివరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సంజయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలం నుండి 40 కి.మీ దూరంలో ఉన్న ఉజ్జయినిలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
“సంజయ్ 2024 జూన్ లో ఇల్లు ఖాళీ చేసి ఆ గదిని మాత్రమే ఉంచుకున్నాడు. బల్వీర్ రాజ్ పుత్ అనే వ్యక్తి జూలై 2024 లో ఈ ఇంటికి వచ్చాడు. అంతకుముందు, ఆ మహిళ మరియు సంజయ్ ఇక్కడ కలిసి నివసిస్తున్నారు. అయితే, ఆ మహిళ చాలా రోజులుగా కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. అతను ఆ మహిళ రెండు చేతులను కట్టివేసి ఫ్రిజ్ లో పడేసాడు” అని గెహ్లాట్ చెప్పారు.
పోలీసుల ప్రకారం, సంజయ్ ఆ మహిళతో లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ఒప్పుకున్నాడు. అతను 2023 లో ఆమెతో ఇంటికి మారాడు. కానీ వారు వివాహం చేసుకున్నారని పొరుగువారికి అబద్ధం చెప్పాడు.
ఇంతలో, 2024 జనవరిలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రతిభా సంజయ్‌ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దానికి అతను అంగీకరించలేదు. ఈ విషయంపై తరచూ గొడవలు జరిగేవి.
ఆ గొడవ భరించలేక, ప్రతిభాను చంపాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు వినోద్ దేవ్‌కు చెప్పాడు. ఇద్దరూ కలిసి గత ఏడాది మార్చిలో ఆ మహిళను గొంతు కోసి చంపారు. తరువాత, ఆమె చేతులు, కాళ్లు కట్టి ఫ్రిజ్‌లో పెట్టారు.
ఆ తర్వాత, గత ఏడాది జూన్‌లో, సంజయ్ ఇల్లు ఖాళీ చేశాడు. కానీ కొన్ని విషయాలు ఉన్నాయని చెప్పి గది తాళం చెవిని తన దగ్గర ఉంచుకున్నాడు. అప్పుడప్పుడు వచ్చి గది తెరిచి తనిఖీ చేసేవాడు.
ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.