న్యూఢిల్లీ : క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఇది చేదువార్త! వారి బకాయిలపై భారీ వడ్డీ చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
గతంలో, బ్యాంకులు క్రెడిట్ కార్డ్ బకాయిలపై 35% నుండి 50% వరకు వడ్డీని వసూలు చేసేవి. దీన్ని సవాలు చేస్తూ ఆవాజ్ ఫౌండేషన్ దాఖలు చేసిన కేసులో, ఈ వడ్డీ శాతం చాలా ఎక్కువగా ఉందని, అన్యాయమని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు చెప్పింది. 30 శాతానికి మించకుండా వడ్డీ పరిమితిని విధించింది.
దీనిపై బ్యాంకులు సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశాయి. శుక్రవారం ధర్మాసనం తీర్పునిస్తూ ఫోరమ్ ఆదేశాలను పక్కన పెట్టింది. 30 శాతం పరిమితిని ఎత్తివేశారు. బ్యాంకులు తమ అభీష్టానుసారం 30 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లను వసూలు చేసేందుకు అనుమతించింది.