సేవింగ్స్ అంటే FD లేదా RD లో మాత్రమేనా? ₹9,000 SIP తో ₹1 కోటి సంపాదించవచ్చు అంటే నమ్మగలరా? SIP ద్వారా మీరు క్రమబద్ధమైన పెట్టుబడి చేసుకుంటూ, మార్కెట్ వృద్ధిని ఉపయోగించుకుని కోటి సంపాదించవచ్చు. ఆలస్యం చేస్తే ఇంత పెద్ద మొత్తాన్ని సంపాదించే అవకాశం మిస్సవుతారు.
SIP అంటే ఏమిటి?
SIP (Systematic Investment Plan) అనేది మ్యూచువల్ ఫండ్స్ లో నెలనెలా పెట్టుబడి పెట్టే విధానం. ఒక్కసారి భారీ మొత్తాన్ని పెట్టాల్సిన అవసరం లేకుండా, చిన్న మొత్తాలను క్రమంగా పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద రాబడి పొందొచ్చు. దీని వల్ల మార్కెట్ పెరుగుదల, కంపౌండింగ్ ప్రభావం వల్ల మీ డబ్బు గుణించుకుంటూ పెరుగుతుంది.
SIP ఎలా పనిచేస్తుంది?
- మీరు నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోవాలి (ఉదా: ₹9,000).
- ఈ మొత్తం మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా మ్యూచువల్ ఫండ్ లోకి వెళుతుంది.
- ప్రతి నెల మీరు కొనుగోలు చేసే యూనిట్లు మార్కెట్ విలువ ఆధారంగా ఉండటంతో, మార్కెట్ పతనం సమయంలో తక్కువ ధరకే ఎక్కువ యూనిట్లు వస్తాయి.
- మధ్యకాలంలో పలు మార్కెట్ హెచ్చుతగ్గులున్నా, దీర్ఘకాలానికి మీ పెట్టుబడి భారీగా పెరుగుతుంది.
Lump Sum vs SIP – ఏది బెటర్?
ఒకరు రూ. 1 లక్ష ఒకేసారి మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెడితే, ఇంకొకరు అదే మొత్తాన్ని నెలనెలా SIP రూపంలో విడతలుగా ఇన్వెస్ట్ చేస్తే – SIP పెట్టుబడి రిస్క్ తక్కువగా ఉండి, మార్కెట్ హెచ్చుతగ్గులను తట్టుకునేలా ఉంటుంది. దీని వల్ల “Rupee Cost Averaging” ప్రయోజనం లభిస్తుంది.
Related News
₹9,000 SIP తో ₹1 కోటి సాధించాలంటే ఎంత కాలం పడుతుంది?
- నెలవారీ పెట్టుబడి: ₹9,000
- మొత్తం పెట్టుబడి (22 సంవత్సరాల్లో): ₹23,76,000
- అంచనా వడ్డీ రాబడి: ₹82,52,406
- మొత్తం విలువ: ₹1,06,28,406
22 సంవత్సరాల్లో ₹9,000 SIPతో ₹1 కోటి పైగా సంపాదించొచ్చు. క్రమశిక్షణగా పెట్టుబడి చేస్తూ, మరింత సమయం పెంచుకుంటే ₹2 కోట్లు కూడా సాధించవచ్చు.
SIP ఎప్పుడు స్టార్ట్ చేయాలి?
రేపటి నుంచి చేస్తా అనుకుంటే… రాబడి తగ్గుతుంది. ఈరోజే స్టార్ట్ చేస్తే… కొన్ని ఏళ్లలోనే కోటి చేరుకోవచ్చు.
SIP లాంగ్ టర్మ్‌లో సురక్షితమైన పెట్టుబడి విధానం. చిన్న మొత్తాలతో మొదలుపెట్టి, కాలానుగుణంగా పెంచుకుంటూ పోతే – మీ డబ్బు రెట్టింపు కాకుండా గుణించుకుంటూ వెళ్తుంది.
ఇప్పుడు ఏమి చేయాలి?
- ఆలస్యం చేయకుండా ఈరోజే SIP స్టార్ట్ చేయండి
- ఫండ్స్ ఎంపికలో అనుమానాలు ఉంటే, నిపుణుల సలహా తీసుకోండి.
- సర్దుబాటు ఉండేలా, మీ పెట్టుబడిని సంవత్సరానికి పెంచుకుంటూ పోండి.
ఇప్పుడే ప్రారంభించండి – లేటయితే లాస్