తక్కువ జీతంతో ₹2 లక్షల ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పరచుకోవాలా? ఈ 5 స్టెప్స్ మీ భవిష్యత్తును సురక్షితం చేస్తాయి…

భవిష్యత్తు అనిశ్చితంగా ఉంటుంది. ఉద్యోగం పోతే? హఠాత్తుగా వైద్య ఖర్చులు వస్తే? మీరు రెడీనా? ఎమర్జెన్సీ ఫండ్ లేకుంటే అప్పులు చేయాల్సి వస్తుంది, క్రెడిట్ కార్డ్ బకాయిలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే, కేవలం 12 నెలల్లోనే మీకు భద్రత కలిగించే ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోవచ్చు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

1. మీ నెలకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోండి

మొదట మీ నెలవారీ ఖర్చులు లెక్కగట్టాలి. ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, కిరాణా ఖర్చులు, లోన్ EMIలు— ఈ ఖర్చులకు తగ్గట్టు 3-6 నెలల దాకా సేవ్ చేయాలి. అంటే నెలకు ₹30,000 ఖర్చు అయితే, కనీసం ₹90,000 – ₹1,80,000 వరకు సేవ్ చేయాలి. మీ జీతం తక్కువ ఉన్నా దాంట్లో వీలయినంత ఆదా చేయండి.

2. ప్రత్యేకంగా సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేయండి

ఖర్చు & పొదుపు విభజన చాలా ముఖ్యం. HDFC, Kotak, SBI వంటి బ్యాంకుల్లో ప్రత్యేక సేవింగ్స్ ఖాతా తెరవండి. అలాగే ఆటోమేటిక్ మంత్లీ సేవింగ్స్ సెటప్ చేయడం వల్ల డబ్బు ఖర్చు కాకుండా సేవ్ అవుతుంది

Related News

3. అనవసర ఖర్చులను తగ్గించండి

జీతం వచ్చిన వెంటనే ఖర్చులు చేసేస్తే పొదుపు అసంభవం. రెస్టారెంట్లు, ఖరీదైన బట్టలు, ఫ్యాన్సీ గాడ్జెట్స్—ఈ ఖర్చులను నియంత్రించి ఆ డబ్బును ఎమర్జెన్సీ ఫండ్‌కి మళ్లించండి.

4. అదనపు ఆదాయ మార్గాలను ఎంచుకోండి

ఫ్రీలాన్సింగ్, పార్ట్ టైమ్ వర్క్, అఫిలియేట్ మార్కెటింగ్—ఇవి అదనపు ఆదాయానికి మంచి మార్గాలు. మీ ప్రస్తుత ఆదాయంతో పాటు ₹5,000 – ₹10,000 అదనంగా సంపాదించడం ద్వారా, 12 నెలల్లోనే లక్షల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు

5. ప్రతి నెల ప్రోగ్రెస్ చెక్ చేయండి

సేవింగ్స్ ఎలా సాగుతున్నాయో ప్రతి నెల కూడా చెక్ చేసుకోవాలి. అవసరమైతే సేవింగ్స్ మొత్తం పెంచండి. అలాగే, నిరంతరం ఫైనాన్షియల్ అవేర్‌నెస్ పెంచుకోండి.

ఎందుకు ఎమర్జెన్సీ ఫండ్ చాలా ముఖ్యం?

గత రెండు ఏళ్లలోనే లక్షల మంది ఉద్యోగం కోల్పోయారు. క్రెడిట్ కార్డు అప్పులు, లోన్ బకాయిలు పెరిగిపోయాయి. ఈ రిస్క్ మీకు రావద్దంటే నేటినుంచే ఎమర్జెన్సీ ఫండ్ ప్లాన్ చేయండి. ఆలస్యం మీను అప్పుల బానిసగా మారుస్తుంది.

12 నెలల టార్గెట్ పెట్టుకుని మొదలు పెట్టండి. సురక్షితమైన భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.