Jio: జియో యూజర్లకు క్రేజీ న్యూస్.. ఈ కొత్త రీఛార్జ్‌ తో 3 నెలలు జియో హాట్‌స్టార్‌ ఫ్రీ..

ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లు జియో, డిస్నీ హాట్‌స్టార్ విలీనం అయి ‘జియో డిస్నీ హాట్‌స్టార్’గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, వినియోగదారులను ఆకర్షించడానికి వివిధ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో రిలయన్స్ జియో మొబైల్ నెట్‌వర్క్ వినియోగదారులకు మరో క్రేజీ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్లు కేవలం రూ. 100తో రీఛార్జ్ చేసుకుంటే జియో హాట్‌స్టార్‌ను 3 నెలలు ఉచితంగా పొందవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

మీరు కేవలం రూ. 100తో ప్రీపెయిడ్ ప్లాన్‌ను రీఛార్జ్ చేస్తే.. మీకు 90 రోజుల చెల్లుబాటుతో 5GB డేటాతో పాటు ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. జియో హాట్‌స్టార్ సేవలను మొబైల్‌తో పాటు టీవీలో కూడా పొందవచ్చు. అయితే, ఈ ప్లాన్ ద్వారా మీరు కాల్స్ మరియు SMS వంటి సౌకర్యాలను పొందలేరు. ఇంతలో, జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ నెలకు రూ. 149. ప్రీమియం ప్లాన్ కావాలనుకునే వారు నెలకు రూ. 299 చెల్లించాలి. సంవత్సరానికి రూ. 1,499.

Related News

అలాగే, ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్నందున, క్రికెట్ అభిమానుల కోసం మరో ప్రత్యేక క్రికెట్ డేటా ప్యాక్ అందుబాటులోకి వచ్చింది. మీరు రూ. 195తో రీఛార్జ్ చేసుకుంటే.. మీకు మొత్తం 15GB డేటా లభిస్తుంది. జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ 90 రోజులు ఉచితంగా లభిస్తుంది. అయితే, దీనికి కూడా డేటా ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి.