తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నిన్నగాక మొన్నటి వరకు ఎండలు మండుతుండగా, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏపీ, తెలంగాణల్లో చల్లటి వాతావరణం నెలకొంది. సరిగ్గా అదే సమయంలో వాతావరణ శాఖ మరో ఉలిక్కిపడే ప్రసంగం చేసింది. ఏపీలో రెండు రోజులు, తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తమిళనాడులో ఏర్పడిన వాయుగుండం ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనా బలంగా వ్యాపించిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాంతో ఏపీ, తెలంగాణలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లా కోడుమూరులో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు పలుచోట్ల రేకుల షెడ్లు ధ్వంసమయ్యాయి. అలాగే.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో పలుచోట్ల వర్షం కురిసింది. అయితే గత నెల రోజులుగా ఎండలు, ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షంతో కాస్త ఊరట లభించింది.
Related News
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, నిజాంపేట్, కుత్బుల్లాపూర్, శంషాబాద్, రాజేంద్రనగర్‌లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లో ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో అకస్మాత్తుగా వర్షం బీభత్సం సృష్టించింది. మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది.