ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులు ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు వేర్వేరు వాతావరణ పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చెట్ల కింద నిలబడకూడదు. వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారం (15-04-25):
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బుధవారం (16-04-25):
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Related News
గురువారం (17-04-25):
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సోమవారం వైఎస్ఆర్ జిల్లాలోని వేంపల్లి, కర్నూలు జిల్లాలోని వాగరూర్‌లో 41.8°C, నంద్యాల జిల్లాలోని ఆలమూరులో 41.7°C, తిరుపతి జిల్లాలోని రేణిగుంటలో 41.1°C, శ్రీ సత్యసాయి జిల్లాలోని కనగానపల్లిలో 41°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 47 మండలాల్లో 40°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.