Rain Alert: చల్లటి కబురు..నేటి నుంచి వరుసగా మూడు రోజులు తొలకరి జల్లులు..!

తెలంగాణ ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లని సందేశం ఇచ్చింది. గరిష్ట ఉష్ణోగ్రతలతో మండుతున్న ఎండలతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో నేటి నుండి వరుసగా మూడు రోజులు చలి తీవ్రత ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం (మే 10) ప్రకటించింది. ఈ మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుండి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అనేక జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రెండు రోజులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు కూడా అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

మరోవైపు.. ఈసారి నైరుతి రుతుపవనాలు కొంచెం ముందుగానే దేశంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ఈరోజు ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు ఈ సంవత్సరం 4 రోజుల ముందుగానే ప్రవేశిస్తాయి. దీంతో ఇప్పటికే మండుతున్న ఎండలతో బాధపడుతున్న ప్రజలకు ముందుగానే కొంత ఉపశమనం లభించినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా.. ఈ సంవత్సరం వర్షపాతం సగటు కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనితో పంటలు కూడా సమృద్ధిగా పండే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అధిక పంట దిగుబడితో ఈ ఏడాది మొత్తం శుభ్రంగా ఉండాలని రైతులు కోరుకుంటున్నారు.

Related News