Revanth Reddy: యువతకు భారీ గుడ్ న్యూస్.. రూ.4,00,000 స్కీం ప్రారంభించిన సీఎం రేవంత్

CM Revanth Reddy: అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి 60 నుంచి 80 శాతం సబ్సిడీతో రూ. 6,000 కోట్ల విలువైన రుణాలు ఇవ్వనున్నారు. ప్రతి లబ్ధిదారునికి రూ. 4 లక్షల వరకు మంజూరు చేస్తారు. దీని కోసం ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు, ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అధికారులు దరఖాస్తులను పరిశీలిస్తారు. జూన్ 2న ప్రభుత్వం యువతకు రుణాలు అందించనుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

‘రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 55,000 కంటే ఎక్కువ ఉద్యోగ నియామకాలు చేపట్టి చరిత్ర సృష్టించాం. దేశంలో ఏ ప్రభుత్వం ఒక సంవత్సరంలో ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉచిత RTC బస్సు ప్రయాణానికి రూ. 5,05 కోట్లు ఖర్చు చేశాం. గృహ జ్యోతి పథకంతో 50 లక్షల ఇళ్లలో వెలుగులు చూస్తున్నాం. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయి. బాలికలకు 30 కోట్ల చీరలు ఇవ్వాలని నిర్ణయించాం. కమిషన్ల కోసం కంప్యూటర్లు కొన్నాం కానీ పాఠశాలలకు విద్యుత్ ఇవ్వలేదు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

‘గతంలో మీకు నచ్చితే మంచి ఆలోచన. మీకు నచ్చకపోతే ఇది చక్కటి విధానం. మా ప్రభుత్వంలో ఆ విధానాన్ని నిలిపివేశాం. కుల గణన నిర్వహించిన తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తున్నాం. అప్పులు, ఆదాయంపై అంచనాలు తప్పుగా ఉన్నాయి. ఆదాయం తగ్గింది. అప్పులు విచక్షణారహితంగా పెరిగాయి. అందుకే ప్రజలకు వాస్తవాలు చెబుతున్నాం. గతంలో వసూలు చేయాల్సిన పన్నులు కూడా వసూలు చేయలేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Related News

‘గతంలో ఇసుక నుంచి వచ్చే ఆదాయం రోజుకు రూ.1.25 కోట్లు. ఇప్పుడు ఆదాయం రూ.3 కోట్ల నుంచి రూ.3.50 కోట్లు. రాష్ట్రంలో ఇసుక మాఫియాను అరికట్టాం. అబద్ధాల పునాదిపై ప్రభుత్వాన్ని నడపలేం. వృధా ఖర్చు తగ్గించాం. మంచి పాలన అందించడానికి ప్రయత్నిస్తున్నాం. రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.