CM Jagan: ఫారెన్‌లో సీఎం జగన్ స్టైలిష్ లుక్ ఫోటోలు వైరల్

ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటన ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా యూరప్ పర్యటనకు వెళ్లారు. దాదాపు 15 రోజుల పాటు జగన్ విదేశాల్లో పర్యటించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అయితే జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఇంటికి ఈ రోజే వచ్చి ఉన్నారు . విదేశీ పర్యటన ముగించుకుని శనివారం ఉదయం విజయవాడ చేరుకున్నారు

శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గన్నవరం విమానాశ్రయంలో జగన్ దిగారు . కాగా, వైఎస్ జగన్ లండన్ పర్యటనలో ఉన్న కొన్ని ఫోటోలు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వైరల్ అవుతున్నాయి.

వైఎస్ జగన్ రెగ్యులర్ లుక్ కి భిన్నంగా కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ తెల్ల చొక్కా మాత్రమే ధరించేవారు. అదేవిధంగా బూట్లకు బదులు మామూలు చెప్పులు వేసుకున్నారు.

అయితే లండన్ పర్యటనలో మాత్రం జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్, షూ వేసుకుని చాలా కూల్ గా స్టైలిష్ గా కనిపించాడు. దీంతో వైసీపీ శ్రేణులు ఈ ఫొటోలను వైరల్ చేస్తున్నాయి..సోషల్ మీడియా లో ‘ఏమున్నాడురా అన్న’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు