CM Chandrababu: సూపర్ సిక్స్ పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న ప్రవేశపెట్టనున్న 2025-26 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు చర్చించారు. ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు (బుధవారం) ఉండవల్లిలోని తన నివాసంలో వార్షిక బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సూపర్ సిక్స్ పథకాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీని కోసం బడ్జెట్‌లో కేటాయింపులపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా.. ఈ ఏడాది నుండే తల్లీకి వందనం, అన్నదాత, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల అమలును ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేయడం, బడ్జెట్ కేటాయింపులు చేయడం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి గత ప్రభుత్వాన్ని విమర్శించారు. గత ప్రభుత్వ పాలన కారణంగా మనం ఆర్థిక, ఆరోగ్య సూచికలో అట్టడుగున ఉన్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.