CM Chandrababu: ఇల్లు కట్టుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..

ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో 100 గజాల (2 సెంట్లు)లోపు ఇళ్లు నిర్మించుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయించారు. 300 గజాల లోపు ఇళ్లు నిర్మించుకునే వారికి కూడా అనుమతులు ఇచ్చే వెసులుబాటు కల్పిస్తుంది.కాగా ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధుల(Central Government Funds)తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Related News