GPS గెజిట్ విడుదలపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు విడుదల చేశారో విచారించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
-
జీపీఎస్ అమలు, గెజిట్ విడుదలపై ప్రభుత్వం సీరియస్
-
జీపీఎస్ గెజిట్ ఎలా విడుదల చేశారని సీఎం చంద్రబాబు ఆరా
-
Gazette GO సస్పెండ్ చేయాలని ఆదేశాలు
సీఎం చంద్రబాబు: తమకు తెలియకుండానే గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) అమలు చేస్తూ గెజిట్ జారీ చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. జీపీఎస్ గెజిట్ ఎలా విడుదలైందని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా గెజిట్ ఎలా వచ్చిందన్న అంశంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. వెంటనే జీపీఎస్, గెజిట్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) స్థానంలో గత ప్రభుత్వం GPS విధానాన్ని తీసుకొచ్చింది. అయితే దీనికి సంబంధించి GO MS NO 54 జూన్ 12న విడుదలైంది. అదే రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ జీవో విడుదలైన తర్వాత జులై 12న గెజిట్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. సీపీఎస్, జీపీఎస్ విధానాలను సమీక్షిస్తామని చెప్పిన టీడీపీ కూటమి.
అయితే ఈ గెజిట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. దీనిపై అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం చేశారని తెలిపారు. దీన్ని గత ప్రభుత్వం రూపొందించింది. ఈ నేపథ్యంలో GPS గెజిట్ రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో GPS GO , గెజిట్‌లను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.