ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB) వివిధ విభాగాల్లో 251 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణ, విజయవాడ, శ్రీకాకుళం మరియు కర్నూలు జిల్లాల్లోని జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుల (DCCB)లో ఖాళీగా ఉన్న స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు – ఖాళీలు
- అసిస్టెంట్ మేనేజర్: 50
- స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్: 201
మొత్తం ఖాళీల సంఖ్య: 251
Related News
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 60% మార్కులతో ఏదైనా డిగ్రీ, 55% మార్కులతో పీజీ, తెలుగు/ఇంగ్లీష్ భాషలలో (చదవడం/రాయడం), కంప్యూటర్ పరిజ్ఞానం.
వయస్సు: 31.10.2024 నాటికి 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.26,080- రూ.57,860.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తు రుసుము: రూ.700; ఎస్సీ/ఎస్టీ/పీసీ/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.500.
దరఖాస్తుకు చివరి తేదీ: 22-01-2025
జిల్లా వారీగా నోటిఫికేషన్ లు కింద డౌన్లోడ్ చేసుకొవచ్చు
- గుంటూరు DCCB అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్
- గుంటూరు DCCB స్టాఫ్ అసిస్టెంట్ నోటిఫికేషన్
- కృష్ణ DCCB స్టాఫ్ అసిస్టెంట్ నోటిఫికేషన్
- కర్నూల్ DCCB స్టాఫ్ అసిస్టెంట్ నోటిఫికేషన్
- శ్రీకాకుళం DCCB అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్
- శ్రీకాకుళం DCCB స్టాఫ్ అసిస్టెంట్ నోటిఫికేషన్