కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) దేశవ్యాప్తంగా వివిధ రంగాలలోని పారిశ్రామిక యూనిట్లకు భద్రతను అందిస్తుంది. దీని కోసం ప్రత్యక్ష నియామక ప్రాతిపదికన 1124 కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టుల నియామకానికి CISF దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మెట్రిక్యులేషన్/టెన్త్ అర్హత కలిగిన అర్హత కలిగిన పురుష అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్ట్ కొరకు అదనం గా డ్రైవింగ్ లైసెన్స్ కావలసి ఉంది
ఖాళీ వివరాలు:
Related News
కానిస్టేబుల్/డ్రైవర్: 845 పోస్టులు
(UR- 344, EWS- 84, SC- 126, ST- 63, OBC- 228)
కానిస్టేబుల్/డ్రైవర్-కమ్-పంప్- ఆపరేటర్ (DCPO) (డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీస్)- 279 పోస్టులు
(UR- 116, EWS- 27, SC- 41, ST- 20, OBC- 75)
మొత్తం పోస్టుల సంఖ్య: 1124
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హత, డ్రైవింగ్ లైసెన్స్ మరియు డ్రైవింగ్ అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 04.03.2025 నాటికి 21 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు: కనీస ఎత్తు 167 సెం.మీ, ఛాతీ 80-85 సెం.మీ.
జీత భత్యాలు: నెలకు రూ. 21,700-రూ. 69,100.
నియామక ప్రక్రియ: శారీరక ప్రమాణాల పరీక్ష (PST), శారీరక సామర్థ్య పరీక్ష (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష (OMR/ CBT), వివరణాత్మక వైద్య పరీక్ష, సమీక్ష వైద్య పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ. 100. (SC, ST, ESM అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది).
ముఖ్యమైన తేదీలు…
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 03/02/2025.
ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 04/03/2025.
Official website for online apply