
ఇప్పటి రోజుల్లో ఫోన్‌తోపాటు ల్యాప్‌టాప్‌లు కూడా ఎంతగానో అవసరం అయ్యాయి. వర్క్ ఫ్రమ్ హోం అయినా, ఆన్లైన్ క్లాసులైనా, లేదా సాధారణ ఎడిటింగ్ పనైనా ల్యాప్‌టాప్ అవసరం తప్పదు. కానీ అధిక ధరల వల్ల చాలా మందికి మంచి ల్యాప్‌టాప్ కొనడం కష్టంగా మారుతోంది. అలాంటి వారికోసం ఇప్పుడు మార్కెట్లో మిడ్ రేంజ్ ధరలో మంచి పనితీరు కలిగిన ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి.
మీ బడ్జెట్ రూ.22,000 నుండి రూ.27,000 మధ్యలో ఉంటే, ఈ ల్యాప్‌టాప్‌లు మీకు పనికొస్తాయి. ఇవి స్టూడెంట్స్, ఆఫీస్ వాడకానికి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు వాటి వివరాలను చూద్దాం.
Acer Aspire 3 – రూ.22,990కి మినిమమ్ ధరలో మంచి ల్యాప్‌టాప్: ఈ ల్యాప్‌టాప్‌ను మీరు Amazon లో రూ.22,990కు కొనుగోలు చేయవచ్చు. దీనిలో Intel Core Celeron N4500 ప్రాసెసర్ ఉంది. ఇది Windows 11 Home లో రన్ అవుతుంది. 14 అంగుళాల డిస్ప్లే కలిగిన ఈ ల్యాప్‌టాప్ బరువు కేవలం 1.3 కిలోలే. స్టూడెంట్స్‌కు, డాక్యుమెంట్స్ పనులకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అధిక పనితీరు అవసరం లేని వారికి, ఇంటర్నెట్ బ్రౌజింగ్, Zoom క్లాసులు, Microsoft Office వాడుకునే వారికి Acer Aspire 3 మంచి ఎంపిక.
[news_related_post]CHUWI CoreBook X – రూ.25,990కి హై ఎండ్ ఫీచర్లు: చైనాకు చెందిన CHUWI కంపెనీ నుంచి వచ్చిన ఈ ల్యాప్‌టాప్ Amazonలో భారీ డిస్కౌంట్‌తో రూ.25,990కు లభిస్తుంది. ఇందులో 12th Gen i3-1220 ప్రాసెసర్ ఉంటుంది. Windows 11 సపోర్ట్, 512GB SSD స్టోరేజ్, 8GB RAM వంటి స్పెసిఫికేషన్లు కలిగి ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇందులో బ్యాక్లిట్ కీబోర్డ్ కూడా ఉంటుంది. నైట్ టైంలో టైపింగ్ చేయాల్సిన వారికి ఇది ఓ అదనపు సౌకర్యం. క్లాసులు, లైట్ గేమింగ్, కోడింగ్ మొదలైన పనులకు ఇది బెస్ట్ చాయిస్.
HP 255 G10 Laptop – రూ.22,499కి HP బ్రాండ్ నమ్మకం: HP అంటే నమ్మకమైన బ్రాండ్. ఇప్పుడు మీరు HP 255 G10 ల్యాప్‌టాప్‌ను రూ.22,499కి కొనుగోలు చేయవచ్చు. ఇందులో 8GB RAM, 256GB SSD స్టోరేజ్ ఉంటుంది. Windows 11తో వస్తుంది. 15.6 అంగుళాల పెద్ద డిస్ప్లే ఉన్న ఈ ల్యాప్‌టాప్ బిల్డ్ క్వాలిటీ బలంగా ఉంటుంది. ఇది చాలా దృఢంగా తయారవుతుంది కనుక తరచుగా ప్రయాణించే వాళ్లకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ప్రెజెంటేషన్లు, వీడియో లెక్చర్స్, చిన్న సాఫ్ట్వేర్ టూల్స్ వాడే వారికి ఇది మంచి ఎంపిక.
Lenovo V15 – రూ.26,990కి AMD Ryzen పవర్: Lenovo V15 ల్యాప్‌టాప్ చూడగానే ఆకట్టుకుంటుంది. దీని ధర రూ.26,990. ఇది AMD Ryzen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 512GB SSD స్టోరేజ్, 8GB RAM ఉండటంతో పనితీరు చాలా వేగంగా ఉంటుంది. పెద్ద 15.6 అంగుళాల డిస్ప్లే కలిగి ఉండటం వల్ల వీడియోలు చూడడం, మల్టీటాస్కింగ్ చేయడం సులభం అవుతుంది. దీని బరువు కేవలం 1.63 కిలోలే కావడం వల్ల బ్యాగ్‌లో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఇది స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, ఫ్రీలాన్సర్లకు సూపర్ ఛాయిస్.
ఈ ల్యాప్‌టాప్‌ల ధరలు ₹22,000 నుండి ₹27,000 మధ్యలో ఉండటం వల్ల మధ్య తరగతి కుటుంబాలకు ఎక్కువ భారం కాకుండా, మంచి ఫీచర్లు పొందవచ్చు. ఇవన్నీ SSD స్టోరేజ్‌తో రావడం వల్ల స్టార్ట్టైం తక్కువగా ఉంటుంది. 8GB RAM వలన మల్టీటాస్కింగ్ సులభం. ప్రత్యేకంగా Windows 11తో ఇవన్నీ రన్ అవుతున్నాయి కనుక కొత్త టెక్నాలజీకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. వీడియో కాల్స్, Zoom క్లాసులు, గూగుల్ మీట్, Teams, క్లౌడ్ వర్కింగ్ వంటివన్నీ ఈ ల్యాప్‌టాప్‌లలో సాఫీగా నడుస్తాయి.
మీరు కనీసం ₹22,000 ఇన్వెస్ట్ చేస్తే, మీ పని కోసం 4-5 సంవత్సరాల వరకు పనిచేసే ల్యాప్‌టాప్ మీకు లభిస్తుంది. రోజూ క్లాసులు, పీడీఎఫ్ చదవడం, వర్క్ ఫైల్స్ హ్యాండిల్ చేయడం, చిన్న కోడింగ్ ప్రాజెక్ట్స్ లాంటి పనులకు ఇది చక్కగా సరిపోతుంది. ఎక్కువ ఖర్చు లేకుండా మంచి పనితీరు కోరుకునే వారికి ఇది స్మార్ట్ డిసిషన్.