
భారతదేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీ (LIC) తాజాగా రెండు కొత్త ప్లాన్లను విడుదల చేసింది. ఈ స్కీమ్‌లు సురక్షతో పాటు సేవింగ్స్‌ను కలిపి ఉంటాయి. అంటే బీమా ఉండటం తో పాటు మంచి రాబడులు కూడా వస్తాయి. ఈ రెండు స్కీమ్‌ల పేర్లు “నవజీవన్ శ్రీ ప్లాన్ (Plan 912)” మరియు “నవజీవన్ శ్రీ సింగిల్ ప్రీమియం ప్లాన్ (Plan 911)”. వీటిని ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్లోనూ కొనుగోలు చేయవచ్చు.
ఈ రెండు ప్లాన్లు వ్యక్తిగతంగా తీసుకునే, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్షూరెన్స్ సేవింగ్స్ స్కీమ్‌లు. అంటే మార్కెట్‌కు లింక్ కాకుండా ఉండి, బీమా ద్వారా సేవింగ్స్ చేయగల అవకాశాన్ని ఇస్తాయి. ఈ స్కీమ్‌లలో గ్యారంటీగా అదనపు బోనస్ కూడా లభిస్తుంది. మీ పాలసీ మెచ్యూరిటీ సమయంలో లేదా పాలసీదారుడి మరణ సమయంలో సెటిల్మెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంతేకాదు, ఒక సంవత్సరం పాటు ప్రీమియం చెల్లించిన తరువాత లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంది.
నవజీవన్ శ్రీ ప్లాన్ (Plan 912) వివరాలు: ఈ ప్లాన్‌లో మీరు 6, 8, 10 లేదా 12 ఏళ్ల పాటు మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ వ్యవధి మాత్రం కనీసం 10 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 20 ఏళ్ల వరకు ఉండవచ్చు. ఈ ప్లాన్‌ను 30 రోజుల పిల్లల నుంచి 65 ఏళ్ల వరకు వయసు ఉన్నవారు తీసుకోవచ్చు. పాలసీ ముగిసే సమయానికి మీ వయస్సు కనీసం 18 ఏళ్లు, గరిష్ఠంగా 75 ఏళ్ల లోపు ఉండాలి.
[news_related_post]ఈ ప్లాన్‌లో కనీసంగా ₹5 లక్షల సమ్ అష్యూర్డ్ ఉండాలి. గరిష్ఠ సరిహద్దు ఏమీ లేదు. అంటే మీరు ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ప్రీమియం చెల్లింపు విధానాలు నెలవారీ, త్రైమాసిక, అరవార్షిక, వార్షికంగా ఎంచుకోవచ్చు. ఒక్కో చెల్లింపుకు కనీసం ₹5,000, వార్షికంగా అయితే కనీసంగా ₹50,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో ప్రీమియం చెల్లించి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత లోన్ తీసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆపత్కాలంలో.
నవజీవన్ శ్రీ సింగిల్ ప్రీమియం ప్లాన్ (Plan 911) వివరాలు: ఈ ప్లాన్‌లో కూడా వయస్సు, సమ్ అష్యూర్డ్ విషయాలు Plan 912తో సమానంగా ఉంటాయి. కానీ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో మీరు ఒక్కసారి (సింగిల్ టైం) మాత్రమే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.
ఈ ప్లాన్‌లో ప్రతి ₹1,000 సమ్ అష్యూర్డ్‌కు ₹85 గ్యారంటీ అడిషన్ లభిస్తుంది. అంటే మీరు ₹1 లక్ష పెట్టుబడి పెడితే, అదనంగా ₹8,500 గ్యారంటీగా పొందవచ్చు. పాలసీ టెర్మ్ కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 20 ఏళ్ల వరకు ఉండవచ్చు. కనీస సమ్ అష్యూర్డ్ ₹1 లక్ష. గరిష్ఠ పరిమితి లేదు. మీరు పాలసీ టెర్మ్ పూర్తైన తర్వాత లేదా పాలసీదారుడి మృతిపై మొత్తాన్ని తీసుకోవచ్చు. ఈ స్కీమ్ పూర్తిగా గ్యారంటీ రాబడులకు ప్రాధాన్యత ఇచ్చేలా డిజైన్ చేయబడింది. మార్కెట్ రిస్క్ లేకుండా సేవింగ్స్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
ఈ రెండు ప్లాన్లు సేవింగ్స్ మరియు ప్రొటెక్షన్ రెండింటినీ కలిపినవే. చిన్న వయస్సు నుంచే సేవింగ్స్ ప్రారంభించాలని చూస్తున్నవారికి ఇది ఉత్తమ స్కీమ్. అలాగే, పెద్ద వయసులో జీవిత భద్రతను కోరేవారికి ఇది శ్రేష్ఠ ఎంపిక. ప్రీమియం చెల్లింపు సౌలభ్యం, లోన్ సదుపాయం, గ్యారంటీ రాబడులు వంటి వాటి వల్ల ఇది ప్రతి కుటుంబానికి ఉపయోగపడే స్కీమ్.మీరు కూడా ఈ స్కీమ్‌లపై పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే LIC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా మీకు సమీపంలో ఉన్న ఏజెంట్‌ను సంప్రదించండి.
ఒక్కసారి ₹5 వేల నుంచి ₹50 వేల పెట్టుబడి పెట్టడం ద్వారా లక్షల్లో సేవింగ్స్ ఏర్పడే అవకాశం ఉన్న ఈ స్కీమ్‌లు మీ భవిష్యత్తును భద్రతగా మార్చే అవకాశం కల్పిస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీలకు పెద్ద మొత్తాలు పెట్టే ముందు, LICలాంటి ప్రభుత్వ సంస్థ స్కీమ్‌లను ఓసారి పరిశీలించండి.