ఢిల్లీ ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి కొత్త పథకాన్ని ప్రకటించింది. మహిళా సమృద్ధి యోజన (Mahila Samridhi Yojana) కింద అర్హత గల మహిళలకు ప్రతి నెలకు ₹2,500 అందించేందుకు ₹5000 కోట్ల బడ్జెట్ కేటాయించబడింది.
- అయితే, మీ రేషన్ కార్డ్‌లో ఒక చిన్న తప్పు మీకు ఈ సదుపాయం రాకుండా చేయొచ్చు.
- మీ కుటుంబంలో మీ పేరే Head of the Family (HOF) అని ఉందా?
- ఈ తప్పును సరిచేసుకోకపోతే, మీ అకౌంట్‌లో ఒక్క రూపాయి కూడా జమకాదు.
ఇప్పుడే తెలుసుకుందాం, ఈ పథకానికి అర్హత పొందడానికి ఏమేం చేయాలి?
రేషన్ కార్డ్‌లో ఈ మార్పు చేయడం ఎందుకు అవసరం?
- జాతీయ ఆహార భద్రతా చట్టం – 2013 ప్రకారం, ప్రతి కుటుంబానికి హెడాఫ్‌గా (HOF) ఒక మహిళ పేరు ఉండాలి.
- పేదరిక రేఖ (BPL) కిందకు వచ్చే కుటుంబాలకు ఇది చాలా ముఖ్యమైన మార్పు.
- మీ ఇంట్లో 18 ఏళ్లు దాటిన మహిళ ఉంటే, ఆమె పేరు HOF గా ఉండాలి.
- అలా లేకపోతే, ₹2,500 అందుకునే అవకాశం పూర్తిగా పోతుంది.
మీ రేషన్ కార్డ్‌లో పేరును ఎలా చెక్ చేసుకోవాలి?
మీ పేరు రేషన్ కార్డ్‌లో Head of the Family (HOF) గా ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి:
- దిల్లీ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
- Citizen Corner సెక్షన్‌కి వెళ్లి ‘View Your Ration Card Details’ క్లిక్ చేయండి.
- మీ కుటుంబ సభ్యులలో ఎవరి ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి.
- క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ‘Submit’ క్లిక్ చేయండి.
- మీ రేషన్ కార్డ్ డీటైల్స్ స్క్రీన్ పై కనిపిస్తాయి.
మీ పేరు తప్పుగా ఉంటే ఎలా మార్చుకోవాలి?
మీ పేరు HOF గా లేకపోతే, వెంటనే మార్చుకోవాలి. ఇలా చేయండి:
Related News
- ఆహార సరఫరా కార్యాలయం (Food & Supplies Office) వద్ద అప్లికేషన్ ఫారం తీసుకోవాలి.
- మీ కుటుంబంలోని 18 ఏళ్లు పైబడి ఉన్న మహిళ పేరు HOF గా మార్చాలని రిక్వెస్ట్ చేయాలి.
- కావలసిన డాక్యుమెంట్స్ జతచేయాలి (ఆధార్, పాన్, రేషన్ కార్డ్ వంటివి).
- వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, 30 రోజులలోపు మీ పేరు మారుస్తారు.
ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలంటే తప్పకుండా ఈ పనులు చేయండి
- నెలకు ₹2,500 అంటే సంవత్సరానికి ₹30,000 లబ్ధి.
- మీ రేషన్ కార్డ్‌లో మహిళ పేరు HOF గా ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి.
- పేరులో తప్పు ఉంటే వెంటనే మార్చించుకోండి, లేదంటే ఒక్క రూపాయి కూడా రాదు.
ఇప్పటికే వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు! మరి మీరు? ఆలస్యం చెయ్యకండి.