Mega DSC : మెగా DSC పై చంద్రబాబు మొదటి సంతకం, విద్యాశాఖ కసరత్తు?

AP Mega DSC: రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీపై కసరత్తు చేస్తుంది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచార సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ పై తొలి సంతకం కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

సాధారణంగా ప్రమాణం చేసిన వెంటనే మొదటి సంతకం చేస్తారు. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజున మెగా డీఎస్సీపై తొలి సంతకం జరుగుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది.

దాని స్థానంలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం Mega DSC ఫైలుపైనే చేస్తారని ఇప్పటికే అధికార వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని విద్యాశాఖను ఆదేశించారు.

Related News

13 నుంచి 15 వేల టీచర్ పోస్టులతో నోటిఫికేషన్!

బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను పంపాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 6,100 పోస్టులు ఉన్నాయి. అయితే 13 నుంచి 15 వేల టీచర్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పాత నోటిఫికేషన్‌లో పోస్ట్‌లు

పాత నోటిఫికేషన్‌లో 6,100 పోస్టులు ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులు 2,280, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,299, టీజీటీ పోస్టులు 1,264, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులు 215 ఉన్నాయి. వీటికి దాదాపు 3.30 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పరీక్షలు నిర్వహించలేదు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని ఈసీ పేర్కొనడంతో డీఎస్సీ పరీక్షలకు బ్రేక్ పడింది. దీనితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,67,559 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాల విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది. ఎన్నికల కోడ్ కారణంగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేయలేదు. దీంతో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత నోటిఫికేషన్ కంటే కనీసం రెట్టింపు పోస్టులను ప్రస్తావిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఏపీలో 39 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి

రాష్ట్రంలో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గతేడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. జూలై 31, 2023న అప్పటి విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. 2022-23లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 20021-22లో 38,191 ఉపాధ్యాయ పోస్టులు, 2020-21లో 22,609 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *