Chandrababu Naidu: ఏపీ హిళలకు CM గుడ్ న్యూస్ .. తల్లికి వందనం కీలక అప్డేట్

మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త చెప్పారు. ఈ నెల 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం టైలరింగ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు మరో శుభవార్త చెప్పారు. ఈ నెల 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం టైలరింగ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. 1,02,832 మంది మహిళలకు 90 రోజుల పాటు టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ కేంద్రాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే.

సంకీర్ణ ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా.. ప్రతి కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారో అంత మందికి ఏటా రూ.15,000 ఇస్తామని చెప్పబడింది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ నగదు అందిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకుంటోంది. ఈ మేరకు మే నెలలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నగదు జమ అవుతుంది.