ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ప్రతి పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. ప్రతి మహిళ ఖాతాలో నెలకు 1500 రూపాయలు జమ చేస్తామని, ఆ హామీని నిలబెట్టుకునే దిశగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
18 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు ఈ పథకానికి అర్హులు.
ఈ పథకం అమలుకు విధివిధానాల రూపకల్పన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ పథకం ద్వారా మహిళలకు ఏటా 18,000 రూపాయలు జమ చేస్తారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయానికి కారణమైన పథకాల్లో ఈ పథకం కూడా ఒకటని చెప్పొచ్చు.
Related News
ప్రభుత్వం నుండి నెలకు 1500 రూపాయలు మహిళలకు దీర్ఘకాలంలో పొందే ప్రయోజనం మాత్రమే కాదు. ఎవరి ఆసరా లేకుండా కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడం సాధ్యమేనని చెప్పవచ్చు. మహిళలపై ఆర్థిక భారం తగ్గించేందుకు సంకీర్ణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
సంకీర్ణ ప్రభుత్వం ప్రతి పథకాన్ని త్వరగా అమలు చేస్తే ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఏపీ ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు మహాకూటమి కట్టుబడి ఉన్నట్లు సమాచారం అందుతోంది.