డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థ REC ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల.. ఈనెల 31 వరకు ఛాన్స్‌

REC Ltd రిక్రూట్‌మెంట్ 2024: ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 74 మేనేజర్, ఆఫీసర్, తదితర ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇంజనీరింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్, హెచ్‌ఆర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైర్ సేఫ్టీ, కంపెనీ సెక్రటేరియట్, కార్పొరేట్ కమ్యూనికేషన్, లా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సెక్రటేరియల్, రాజ్‌భాష మరియు ఇతర విభాగాల్లో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.

అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, అభ్యర్థుల షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు డిసెంబర్ 31 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం, మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Related News

మొత్తం ఖాళీల సంఖ్య: 74

  • డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు- 08
  • జనరల్ మేనేజర్ పోస్టులు- 03
  • చీఫ్ మేనేజర్ పోస్టులు- 04
  • మేనేజర్ పోస్టులు- 05
  • అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు- 09
  • ఆఫీసర్ పోస్టులు- 36
  • డిప్యూటీ మేనేజర్ పోస్టులు- 09

ఇతర ముఖ్యమైన సమాచారం:

విభాగాలు: ఇంజినీరింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్, హెచ్‌ఆర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైర్ సేఫ్టీ, కంపెనీ సెక్రటేరియట్, కార్పొరేట్ కమ్యూనికేషన్, లా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సెక్రటేరియల్, రాజ్‌భాష తదితర విభాగాల్లో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.

అర్హత: పోస్టులు మరియు పని అనుభవం ప్రకారం సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్/ఎల్‌ఎల్‌బీ, సీఏ/సీఎంఏ/ఎంఏ/ఎంసీఏ/ఎంఎస్సీ, ఎంబీఏ/పీజీ/పీజీ డిప్లొమా.

గరిష్ట వయో పరిమితి: పోస్టులను బట్టి, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు 48 సంవత్సరాలు; జనరల్ మేనేజర్ పోస్టుకు 52 సంవత్సరాలు; చీఫ్ మేనేజర్‌కు 45 సంవత్సరాలు; మేనేజర్‌కు 42 ఏళ్లు.. అసిస్టెంట్ మేనేజర్‌కు 35 ఏళ్లు.. ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 39 ఏళ్లు.

ఎంపిక ప్రక్రియ: వ్రాత పరీక్ష, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ మొదలైన వాటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము: రూ.1000. SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 31, 2024