కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్… DA 2-3% పెరిగితే రూ. 55,000 జీతం వచ్చే ఛాన్స్…

 DA పెరుగుదలపై ఉద్యోగులు, పెన్షనర్ల ఎదురుచూపు కొనసాగుతోంది. హోలీ సందర్భంగా పెంపు వచ్చే అవకాశం ఉందని భావించినా, ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. మార్చి 26న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ మీటింగ్‌లో DA పెంపుపై నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది.

DA ఎంత పెరగొచ్చు?

  •  ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 53% DA అందుతోంది.
  •  జనవరి 2025 నుంచి కొత్త పెరుగుదల అమలులోకి రానుంది.
  •  AICPI ఇండెక్స్ డేటా ప్రకారం, DA 2-3% పెరిగే అవకాశం ఉంది.
  •  DA పెంపు నిర్ణయం తీసుకున్న వెంటనే, జనవరి – ఫిబ్రవరి నెలల బకాయిలను కూడా ఉద్యోగులు అందుకుంటారు.

DA పెరిగితే జీతం, పెన్షన్ ఎంత పెరుగుతుంది?

జీతం ₹18,000 అయితే:

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
  • 2% పెంపుతో రూ. 360 పెరుగుతుంది.
  • ఏటా రూ. 4,320 అదనంగా పొందొచ్చు.

పెన్షన్ ₹9,000 అయితే:

  • 2% పెంపుతో రూ. 180 పెరుగుతుంది.
  • ఏటా రూ. 2,160 అదనంగా వస్తుంది.

జీతం ₹1,00,000 అయితే:

Related News

  • ప్రస్తుతం ₹53,000 DA అందుకుంటున్నారు (53%).
  • 55% అయితే ₹55,000 DA పొందే ఛాన్స్.

DA పెంపు ఎప్పుడూ జరగుతుంది?

  •  ప్రతి ఏడాది జనవరి & జూలై నెలల్లో DA పెంపును కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది.
  •  ప్రకటన మాత్రం మార్చి & అక్టోబర్ నెలల్లోనే విడుదల అవుతుంది.
  •  ఈసారి పెంపు జనవరి 2025 నుంచే అమలవుతుందని అంచనా.

మరి.. ఈ పెంపు మీ జీతాన్ని ఎంతవరకు పెంచుతుంది? వెయిట్ చేయండి, గుడ్ న్యూస్ రాబోతోంది. జీతం మరింత పెరగనుందా? పెన్షన్ మరింత లాభం ఇవ్వనుందా? అధికారిక ప్రకటన వచ్చేలోపు మీ లెక్కలు సెట్ చేసుకోండి.