పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులే పాఠశాల సమయంలో ఫోన్‌లో గేమ్‌లు ఆడుతూ సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని సంబల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్ విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ఫోన్‌లో క్యాండీ క్రష్ ఆడుతున్నాడు.
జిల్లా కలెక్టర్ రాజేంద్ర పాన్సియా ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు వెళ్లారు. తనిఖీల్లో భాగంగా అక్కడ ఉన్న ఆరుగురు విద్యార్థుల సమాధాన పత్రాలను పరిశీలించగా వాటిలో 95 తప్పులు ఉన్నట్లు గుర్తించారు.
Related News
క్లాస్‌లోని అసిస్టెంట్ టీచర్ ఫోన్‌ను పరిశీలించగా.. క్యాండీ క్రష్ ఆడుతున్నట్లు గుర్తించారు. డిజిటల్ వెల్‌బీయింగ్‌లోకి వెళ్లి పరిశీలించగా.. దాదాపు 2 గంటలు క్యాండీ క్రష్, మరో గంట కాల్స్, సోషల్ మీడియాలో గడిపినట్లు తెలిసింది.
కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు.