మ్యూచువల్ ఫండ్స్ అనేది పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేకుండా చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టే అవకాశం ఇస్తుంది. కానీ, చాలామందికి ఇంకా సందేహాలు ఉంటాయి. మీకూ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియక ఇన్వెస్ట్ చేయడం ఆలస్యం అవుతోందా? ఈ ప్రశ్నలు-సమాధానాలు మీకోసం.
ప్రశ్న 1: మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి? నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
సమాధానం: మ్యూచువల్ ఫండ్ అనేది వివిధ స్టాక్స్, బాండ్స్, డెట్ ఇన్స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడి పెట్టే కలెక్షన్. దీనిని నిపుణులు నిర్వహిస్తారు. మీరు డైరెక్ట్‌గా మార్కెట్లో ట్రేడింగ్ చేయకుండా, SIP లేదా లమ్సమ్ ద్వారా చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఇన్వెస్ట్ చేయడానికి స్టెప్స్:
- మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ ఎంచుకోండి
- SIP ద్వారా నెలనెలా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టండి
- పొదుపుతోపాటు అధిక రాబడుల కోసం దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయండి
- టార్గెట్ అందుకున్నప్పుడు రిడీమ్ చేసుకుని లాభాలను ఆస్వాదించండి
ప్రశ్న 2: ₹3,000 SIP తో 10, 20, 30 ఏళ్లకు ఎంత రాబడి వస్తుంది?
సమాధానం: SIP ద్వారా చిన్న మొత్తాలను ఇన్వెస్ట్ చేస్తూ, ఎక్కువ కాలం దానిని కొనసాగిస్తే ఎక్కువ లాభాలు పొందొచ్చు. ఉదాహరణగా, 12% సగటు రాబడిని పరిగణించుకుని లెక్కలు చూస్తే:
Related News
- ₹3,000 SIP – 10 సంవత్సరాలు: ₹7.00 లక్షలు
- ₹3,000 SIP – 20 సంవత్సరాలు: ₹29.50 లక్షలు
- ₹3,000 SIP – 30 సంవత్సరాలు: ₹1.06 కోట్లు
ఈ అవకాశం మిస్ అయితే మళ్లీ రావడం కష్టం. మీరు ఎంచుకోబోయే ఫండ్స్ ధరలు రోజు మారుతూ ఉంటాయి కాబట్టి మీరు ఎంత త్వరగా సిప్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. మ్యూచువల్ ఫండ్స్‌లో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టినా, దీర్ఘకాలంలో లక్షల్లో రాబడులు సాధించొచ్చు. లేట్ అయితే లాస్. ఇప్పుడే మీ SIP ప్రారంభించి మీ భవిష్యత్తును సేఫ్ చేసుకోండి.