మారుతున్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఆదాయ మార్గాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం రకరకాల వ్యాపారాల కోసం వెతుకుతున్నారు. అయితే వ్యాపారం అంటే నష్టాలే అని చాలా మంది అభిప్రాయం.
కానీ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేస్తే మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అలాంటి best business idea గురించి ఈరోజు తెలుసుకుందాం.
కర్పూరం వాడకం ఎంత అనివార్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేవాలయాల నుండి ఇళ్ల వరకు ప్రతి రోజు ప్రతి కర్పూరం ఉండాలి. హిందువులు ప్రతిరోజూ కర్పూరాన్ని ఖచ్చితంగా ఉపయోగిస్తారు. అటువంటి నిత్యావసర వస్తువుల తయారీని మీ వ్యాపారంగా మార్చుకుంటే మీరు భారీ లాభాలను ఆర్జించవచ్చు. కర్పూరం తయారీకి అవసరమైన యంత్రాలు ఏమిటి? ఎంత పెట్టుబడి అవసరం? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Related News
కర్పూరం తయారీకి కావలసినది తయారీ మిషన్‌తో పాటు ముడిసరుకు మాత్రమే. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లు Online లో మరియు Offline లో అందుబాటులో ఉన్నాయి. ఈ మిషన్ ఖర్చు విషయానికొస్తే, పూర్తిగా ఆటోమేటెడ్ మిషన్ ధర రూ. 1 లక్ష నుండి. వీటితో పాటు ముడిసరుకు కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్యాకింగ్ కోసం కవర్ కూడా అవసరం. ఇలా తయారు చేసిన కర్పూరాన్ని సొంత బ్రాండ్ తో మార్కెట్ చేసి విక్రయిస్తే మంచి ఆదాయం పొందవచ్చు.
యూట్యూబ్‌లో కర్పూరం మేకింగ్ మిషన్‌లకు సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయి. పేర్కొన్న నంబర్లను సంప్రదించడం ద్వారా యంత్రాలు అలాగే ముడి పదార్థాలు పొందవచ్చు. అయితే ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. నేరుగా వెళ్లి మెషీన్‌ని చూసి, తయారీ విధానాన్ని తెలుసుకున్న తర్వాతే చెల్లించాలి. ముందుగా డబ్బులు చెల్లించకపోవడమే మంచిది.