BREAKING: వైసీపీ నవరత్నాల గుడి ధ్వంసం.. అక్కడ అంతా టెన్షన్.. టెన్షన్

హోరాహోరీగా సాగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి 164 సీట్లు గెలుచుకుంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదిరిస్తూ.. ఇన్నాళ్లు ఉలిక్కిపడ్డ తెలుగు తమ్ముళ్లు.. అధికారంలోకి వచ్చామన్న ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

శిలా ఫలకాలను ధ్వంసం చేయడం, వైసీపీ ప్రభుత్వం వేసిన శంకుస్థాపన పేర్లను చెరిపేసే పని చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ నిర్మించిన వైసీపీ నవరత్నాలయాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు.

ఆలయాన్ని నేలమట్టం చేసి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో స్థానిక వైసీపీ నేతలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ఆలయం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.