హైదరాబాద్: శ్రీ చైతన్య విద్యాసంస్థలకు చెందిన పలు కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఏపీలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల కార్పొరేట్ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్, విజయవాడ, మాదాపూర్లోని శ్రీ చైతన్య కార్పొరేట్ కార్యాలయంతో పాటు ఏపీలోని మరికొన్ని చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. సీఆర్పీఎఫ్ భద్రతతో ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పన్ను చెల్లింపులు, ఆదాయం, ఖర్చులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.