తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ కు పెద్ద షాక్ తగిలింది. ఈ మేరకు ఎస్సీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది.
బాధితురాలు లక్ష్మీ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిరణ్ రాయల్ పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని లక్ష్మీ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన తనకు అబద్ధం చెప్పడమే కాకుండా చంపేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు లక్ష్మీ రెడ్డి తెలిపారు.
ఈ మేరకు పోలీసులు క్రైమ్ నంబర్ 22/2025 కింద 420, 417, 506 ఐపీసీతో పాటు ఇండియన్ లా కోడ్ లోని బీఎన్ఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, తిరుపతి జనసేన ఇన్ చార్జి కిరణ్ రాయల్ పై కేసు నమోదు చేయడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు త్వరలోనే ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉంది. మరోవైపు, కిరణ్ పై కేసు నమోదు గురించి జనసేన వర్గాలు అధికారికంగా ప్రకటన చేయకపోవడం గమనార్హం. రాజకీయ ప్రయోజనాల కోసమే కిరణ్‌పై కుట్ర జరిగిందని ఆయన అభిమానులు, మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.