5 లక్షల వరకు ఆటో క్లెయిమ్ – ఇకపైన వేచి చూడాల్సిన పనిలేదు
ఈ ప్రతిపాదన CBT ఆమోదం పొందిన తర్వాత, EPFO సభ్యులు 5 లక్షల వరకు ఆటోమేటిక్‌గా విత్‌డ్రా చేసుకునే అవకాశం లభించనుంది. ఈ నిర్ణయం ఉద్యోగులకు పెద్ద ఊరటగా మారనుంది, ముఖ్యంగా అత్యవసర అవసరాల కోసం వెంటనే డబ్బు అవసరమైన వారికీ ఇది చాలా ఉపయోగకరం.
ఇప్పటి వరకు.. 2020లో ఆరోగ్య సంబంధిత క్లెయిమ్‌లకు ఆటో క్లెయిమ్ విధానం ప్రవేశపెట్టారు. 2024 మేలో ఈ పరిమితిని ₹50,000 నుండి ₹1 లక్షకు పెంచారు. ఇప్పుడు అదే పరిమితిని ₹5 లక్షలకు పెంచే ప్రతిపాదన లాంచ్ చేశారు.
ఇకపై ATM & UPI ద్వారా PF విత్‌డ్రా
ఇది మాత్రమే కాదు, EPFO కొత్త డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. ఇకపై ATM లేదా UPI ద్వారా PF విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సూచనకు కేంద్ర కార్మిక శాఖ ఆమోదం తెలిపింది. మే లేదా జూన్ 2025 నాటికి ఈ సదుపాయాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
Related News
EPFO సభ్యులకు లాభాలు ఏమిటి?
సులభమైన విత్‌డ్రా – ఇకపై 5 లక్షల వరకు విత్‌డ్రా చేయడం చాలా ఈజీ. త్వరితంగా క్లెయిమ్ ప్రక్రియ – కేవలం 3-4 రోజుల్లోనే డబ్బు ఖాతాలోకి. అంతా ఆటోమేటిక్ – ఇక మానవీయ జోక్యం లేకుండా పూర్తిగా IT వ్యవస్థ ద్వారా క్లెయిమ్ ప్రాసెస్ అవుతుంది. UPI & ATM ద్వారా డైరెక్ట్ ఫండ్ ట్రాన్స్ఫర్ – ఇకపైనా నేరుగా డబ్బు మీ ఖాతాలోకి వస్తుంది. క్లెయిమ్ రిజెక్షన్ తగ్గుతుంది – కొత్త వెరిఫికేషన్ విధానం ద్వారా క్లెయిమ్ తిరస్కరణ సమస్య తగ్గుతుంది.
ఈ కొత్త మార్పులతో EPFO సేవలు మరింత వేగవంతం, సులభం, డిజిటల్‌గా మారనున్నాయి. మీ PF డబ్బును ఇకపై మినిమమ్ సమయంలో పొందే అవకాశం వచ్చేస్తోంది. మీ ఖాతాలో ఎంత PF ఉంది? ఈ సదుపాయం వచ్చాక ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు? వెంటనే చెక్ చేసుకోండి.