BIG BREAKING: టీడీపీలోకి మంచు మనోజ్!

మంచు కుటుంబంలో విభేదాలు ముదిరిన తరుణంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రి, సోదరుడిని ఎదుర్కోవడానికి రాజకీయ మద్దతు కోసం చూస్తున్న మనోజ్ టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

నారాలోకేష్ తో 45 నిమిషాలకు పైగా చర్చలు జరపడం దీనికి బలం చేకూరుస్తోంది.

భూమా అఖిలప్రియ మద్దతు..

Related News

ఈ మేరకు తన తండ్రి, సోదరుడితో ఉన్న ఆస్తి వివాదంలో మంచు మనోజ్ రాజకీయ మద్దతు కోసం టీడీపీ వైపు చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. అంతేకాకుండా, మనోజ్ త్వరలో టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. బుధవారం మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లిన మనోజ్ అక్కడి నుంచి నేరుగా నారావారిపల్లెకు వెళ్లి నారాలోకేష్ ను కలిశారు. వారు ఆయనతో 45 నిమిషాల పాటు చర్చించారు. మనోజ్ భార్య భూమా మౌనిక సోదరి భూమా అఖిలప్రియ టీడీపీ ఎమ్మెల్యే కావడం కూడా దీనికి బలాన్ని చేకూరుస్తోంది.