కొత్త అప్​డేట్స్​తో బెస్ట్ ఫ్యామిలీ స్కూటీ.. ధర ,ఇంజిన్, ఫీచర్స్ ఇలా..!

యాక్టివా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్. హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా దాని ప్రసిద్ధ స్కూటర్ యాక్టివా OBD2B-కంప్లైంట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ OBD2B ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. దీనిలో కొన్ని కొత్త ఫీచర్లు కూడాచేర్చారు. ఈ యాక్టివా టీవీఎస్ జూపిటర్‌తో నేరుగా పోటీపడుతుంది. ఇపుడు ఈ స్కూటర్ కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఫీచర్స్

యువత, కుటుంబాల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. కొత్త యాక్టివాలో 4.2-అంగుళాల TFT డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి.

Related News

 

ఇంజిన్, పవర్

కొత్త యాక్టివా 109.51cc సింగిల్ సిలిండర్ PGM-Fi ఇంజిన్‌తో వస్తుంది. ఇది ఇప్పుడు OBD2B కంప్లైంట్‌గా ఉంది. ఇది కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ స్కూటర్ ఇంజన్ 5.88 kW శక్తిని, 9.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంధనాన్ని ఆదా చేయడానికి, స్కూటర్‌లో ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ జోడించారు.

ధర

కొత్త హోండా యాక్టివా ఎక్స్-షోరూమ్ ధర రూ.80,950 నుండి ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది. ఇది STD, DLX, H-స్మార్ట్ అనే 3 వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్కూటర్ తెలుపు, మెటాలిక్ బ్లూ, నలుపు, బూడిద మెటాలిక్, మెటాలిక్ రెడ్, నీలం రంగుల ఎంపికలలో లభిస్తుంది. ఈ స్కూటర్ భారతదేశంలోని అన్ని HMSI డీలర్‌షిప్‌లలో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.

 

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *