అందరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. దీన్ని చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్యూటీ ప్రొడక్ట్స్ వైపు మొగ్గు చూపుతారు. ఇందుకోసం మార్కెట్లో అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
అయితే విటమిన్ ఇ క్యాప్సూల్స్ కూడా అందాన్ని రెట్టింపు చేస్తాయని మీకు తెలుసా? vitamin E capsules చర్మానికి పోషణను అందిస్తాయి. ముడతలతో బాధపడే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
vitamin E capsules ను ప్రతిరోజూ ముఖానికి రాసుకోవడం వల్ల మచ్చలు తొలగిపోతాయి. ముఖ్యంగా మొటిమలు తగ్గిన తర్వాత కనిపించే మచ్చలు. విటమిన్ ఇలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి చర్మానికి రంగును తెస్తాయి. ఇవి చర్మాన్ని తేమగా మార్చడంలో కూడా ఉపయోగపడతాయి. ఇది మొటిమలను కూడా తగ్గించి, ముఖాన్ని మెరిసేలా చేస్తుంది.
Related News
vitamin E capsulesనుంచి తీసిన నూనెను ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం ముందుగా అరచేతిలో నూనె తీసుకుని వేళ్ల సాయంతో ముఖంపై నెమ్మదిగా మసాజ్ చేయాలి. మెడకు అప్లై చేయడం వల్ల కూడా మంచి రంగు వస్తుంది. ఇలా సుమారు
20 నిమిషాలు మసాజ్ చేసి, ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. దీన్ని ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. పెరుగు మరియు పసుపు Face Pack లోvitamin E capsules నూనెను జోడించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
capsules లో నూనెను బాదం, కొబ్బరి, ఆలివ్ వంటి నూనెలతో కలిపి ముఖానికి రాసుకోవాలి. కేవలం 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఈ నూనెను రాసుకునే సమయంలో, ముఖాన్ని బాగా శుభ్రం చేసి, ఆపై ముఖానికి అప్లై చేయాలి. అయితే ముఖానికి అప్లై చేసేటప్పుడు డాక్టర్ సూచనలను కచ్చితంగా పాటించాలి. కొందరికి చర్మ ప్రతిచర్యలు ఉండవచ్చు.
గమనిక: పై సమాచారం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు పాటించడం మంచిది.