రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (IIIT) బాసర అడ్మిషన్లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. అభ్యర్థులు జూన్ 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని.. దరఖాస్తుల స్వీకరణకు జూన్ 22 చివరి తేదీ అని అధికారులు తెలిపారు.
IIIT BASARA NOTIFICATION 2024
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఐఐఐటీ) బాసర అడ్మిషన్లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఆసక్తిగల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జూన్ 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని.. మీ సేవ లేదా యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Related News
దరఖాస్తు స్వీకరణకు జూన్ 22 చివరి తేదీ. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశం పొందితే రెండేళ్ల ఇంటర్, నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సులు చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా ఇమెయిల్ (admissions@rgukt.ac.in)ని సంప్రదించండి.