మీ పిల్లలు వీటిని తింటుంన్నారా… కాన్సర్ కారకాలు అని ప్రభుత్వం నిషేదించింది

దయచేసి పేరెంట్స్ పిల్లలకు ఇలాంటి పీచు మిఠాయి కొనకండి…ఇది క్యాన్సర్ కి ప్రమాదకరమైన ఆహారం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు ఆహార భద్రతా విభాగం చెన్నైలో తనిఖీలు నిర్వహించింది

ఈ అధ్యయనంలో రోడమైన్-బి అనే రసాయనాన్ని అధికారులు గుర్తించారు

Related News

ఇది కృత్రిమ రంగు కోసం పీచు మిఠాయిలో ఉపయోగించబడుతుంది

పీచు మిఠాయిల విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పరిశోధనలు తేలడంతో రాష్ట్రంలో వీటి విక్రయాలపై నిషేధం విధించారు. ఈ విషయాన్ని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ శనివారం వెల్లడించారు. తాజాగా పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు ఆహార భద్రతా విభాగం అధికారులు చెన్నైలో తనిఖీలు నిర్వహించారు. ఈ నమూనాల అధ్యయనంలో రోడమైన్-బి అనే రసాయనాన్ని గుర్తించారు. ఇది కృత్రిమ రంగు కోసం పీచు మిఠాయిలో ఉపయోగించబడుతుంది.

రోడమైన్-బిని పారిశ్రామిక రంగు అంటారు. ఇది క్లాత్ కలరింగ్ మరియు పేపర్ ప్రింటింగ్‌లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది ఫుడ్ కలరింగ్ కోసం ఉపయోగించబడదు. దీని వల్ల దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున.. ఈ రసాయనం శరీరంలోకి చేరితే కిడ్నీలు, కాలేయంపై ప్రభావం చూపుతుందని, అల్సర్ తో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు గుర్తించారు. పీచు మిఠాయిల్లో దీన్ని వినియోగిస్తారనే కారణంతో ప్రభుత్వం వీటి అమ్మకాన్ని నిషేధించింది.