Hero EV: పెట్రోల్ స్కూటర్లకు గుడ్‌బై చెప్పే టైమ్ వచ్చేసింది… హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ రూ.70,000కే…

ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల యుగం. పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. ఒక లీటర్ ధర రోజురోజుకూ పెరుగుతుంది. అందుకే కొత్త వాహనం కొనాలనుకుంటున్న వాళ్లు ఎక్కువ మంది ఈవీల వైపు చూస్తున్నారు. ఒకవైపు పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది. మరోవైపు మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ. ఇక పర్యావరణానికి మేలు కూడా. ప్రభుత్వాలూ ఈవీ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ప్రతి కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్, బైక్ తయారీలో బిజీగా ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఓలా, ఏథర్, TVS, బజాజ్ వంటి కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ టూవీలర్లలో బాగానే నిలిచాయి. కానీ ఇప్పుడు వీరితో పోటీలోకి దిగేందుకు హీరో మోటోకార్ప్ కూడా సీరియస్‌గా సిద్ధమవుతోంది. గతంలో Vida అనే కొత్త ఎలక్ట్రిక్ బ్రాండ్‌తో మార్కెట్‌లోకి వచ్చిన హీరో, ఇప్పుడు మరిన్ని కొత్త మోడళ్లతో బరిలోకి దిగబోతోందట.

ఇప్పటికే 2024 డిసెంబర్‌లో Vida V2 అనే మోడల్‌ను లాంచ్ చేసిన హీరో, ఇప్పుడు దాని అప్‌డేటెడ్ వెర్షన్‌ను తీసుకురాబోతోంది. అది కూడా పెద్ద షాకింగ్ ట్యాగ్‌లైన్‌తో.. అందరూ ఊహించని ధరలో! జులై 1, 2025న ఈ కొత్త Vida ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి కాదు.. రెండు మోడళ్లను విడుదల చేయబోతున్నారట. ఇవి రెండు వేర్వేరు మోడళ్లా? లేక ఒకే మోడల్‌కు వేరియంట్లా అన్నది క్లారిటీ లేదు కానీ, రెండు స్కూటర్లు మార్కెట్‌లోకి రానున్నాయని మాత్రం సమాచారం.

Related News

కొత్త Vida స్కూటర్ల ధర షాకింగ్‌గా ఉండబోతుందట. ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం, వీటి ధర సుమారు రూ.70,000 లేదా అంతకంటే తక్కువే కావచ్చట. ఈ ధర పెట్రోల్ స్కూటర్లకు పోటీగా ఉంటుంది. ఇప్పటివరకు ఇంత తక్కువ ధరలో, బ్రాండెడ్ కంపెనీ నుండి వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే తొలిసారి కావొచ్చు. అంటే మీరు పెట్రోల్ స్కూటర్ కొనాలి అనుకుంటే ఓసారి ఆలోచించండి.. ఎందుకంటే ఇదే రేంజ్‌లో ఓ ఫ్యూచర్ టెక్నాలజీ స్కూటర్ దొరుకుతుందంటే ఎవ్వరూ వదలరు.

ఈ స్కూటర్లలో ఫీచర్లు కూడా ఆకట్టుకునేలా ఉంటాయట. మెరుగైన బ్యాటరీ టెక్నాలజీ, ఎక్కువ రేంజ్, స్మార్ట్ కనెక్టివిటీ, యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. వీటిని చూసినవాళ్లంతా ఒక్కసారిగా “వావ్” అనాల్సిందే. 2024లో జరిగిన EICMA ఆటో ఎక్స్‌పోలో Vida Z అనే కాంప్ట్ స్కూటర్ డిస్‌ప్లే చేసింది హీరో. కొత్త మోడళ్లలో ఆ డిజైన్‌కు పోలికలు ఉండవచ్చని ఊహిస్తున్నారు.

హీరో మోటోకార్ప్ ఈ స్కూటర్లను ACPD ప్లాట్‌ఫామ్ మీద తయారు చేస్తోందట. దీని పూర్తి పేరు Affordable Cost Platform for Development. అంటే తక్కువ ధరలో మంచి క్వాలిటీ వాహనాలను తయారు చేయడమే లక్ష్యం. ఇది కూడా మిగతా కంపెనీల కంటే హీరోకు స్పెషల్ అడ్వాంటేజ్.

ఇంకా ఒక ఆసక్తికర విషయమేమిటంటే, హీరో ఈ ఫేస్‌లో మార్కెట్‌లో మంచి వృద్ధి చూపుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలోనే 48,673 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం కంటే ఏకంగా 175 శాతం ఎక్కువ. అంటే ఇప్పటివరకు దీని మీద నమ్మకం పెట్టినవాళ్లంతా సాటిలేని ఫలితాలు అందుకున్నారు. ఇప్పుడు కొత్త మోడళ్లతో మరింత ఊపు తెచ్చుకోబోతోంది.

పూర్తిగా కొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లు, చౌక ధర.. ఇవన్నీ కలిస్తే మార్కెట్‌లో పెట్రోల్ వాహనాలకు నిజమైన చుక్కలు చూపించేది ఇదే కావచ్చు. ఇప్పుడే మీరు కొత్త వాహనం కొనాలనుకుంటే, ఓ వారంరోజులు ఆగండి. జులై 1 తర్వాత పరిస్థితి మారిపోతుంది. ఈవీ రేసులో హీరో చేసే లాంచ్ మీ డిసిషన్‌ను మలుపు తిప్పేలా చేస్తుంది.

ఒక వేళ ఈ లాంచ్‌లో వేరియంట్లు వేర్వేరు బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ధరలతో వస్తే.. వినియోగదారులకైతే ఇంకో అడ్వాంటేజ్. తమ అవసరానికి అనుగుణంగా మోడల్ ఎంచుకోవచ్చు. ముఖ్యంగా డెలివరీ బాయ్స్, అర్బన్ యూజర్లు, కాలేజీ స్టూడెంట్స్ వంటి వారు ఈ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక ఓలా, బజాజ్, TVS, బౌన్స్ వంటి కంపెనీలతో పోటీలో నిలవాలంటే ధర, ఫీచర్లు, లుక్.. అన్నిటిలోనూ టఫ్ ఫైట్ ఇవ్వాలి. హీరో ఇప్పుడు అదే పని చేస్తోందన్నది ఈ తాజా లాంచ్ చూస్తే తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ఇది పూర్తిస్థాయిలో దిగబోతుంది. Vida సిరీస్‌ను మరింత బలపరిచేందుకు ఈ లాంచ్ కీలకం కానుంది.

సాధారణంగా పెట్రోల్ స్కూటర్లు రూ.75,000 నుంచి ప్రారంభమవుతాయి. కానీ అదే రేంజ్‌లో ఇప్పుడు ఒక పెద్ద బ్రాండెడ్ కంపెనీ నుంచి ఓ టెక్నాలజీ స్కూటర్ వస్తోందంటే అర్ధం చేసుకోండి.. ఎలక్ట్రిక్ మార్కెట్ ఎంత వేగంగా ఎదుగుతోందో. ముఖ్యంగా మిలేంజ్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే వాళ్లకు ఇది మంచి ఆఫర్ కావొచ్చు. చార్జింగ్ ఖర్చు తక్కువగా ఉంటే, రోజువారి ప్రయాణానికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

మీరు పాత పెట్రోల్ స్కూటర్‌ను మార్చాలనుకుంటున్నారా? లేక కొత్త వాహనం కొనాలని చూస్తున్నారా? అయితే జులై 1 వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే హీరో మోటోకార్ప్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తాయి. తక్కువ బడ్జెట్‌లో, బ్రాండెడ్ నమ్మకంతో వచ్చే ఈ స్కూటర్లు మిస్ అయితే జీవితాంతం మిస్ అయినట్టే!