హోం లోన్ వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు
ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటును తగ్గించడంతో చాలా బ్యాంకులు కూడా హోం లోన్ వడ్డీ రేట్లను తగ్గించాయి. అయితే, హోం లోన్ పొందడం మీ క్రెడిట్ స్కోర్, రిపేమెంట్ హిస్టరీ, ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ మంచి స్థితిలో ఉంటే బ్యాంక్ ఈజీగా లోన్ మంజూరు చేస్తుంది. లేకపోతే లోన్ పొందడం కష్టమవుతుంది.
హోం లోన్ తక్కువ వడ్డీ రేటుతో ఇచ్చే టాప్ 5 బ్యాంకులు
ఇప్పుడున్న బ్యాంకుల తాజా వడ్డీ రేట్లు ఇవి:
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 8.10% ప్రారంభ వడ్డీ రేటు
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర – 8.10% ప్రారంభ వడ్డీ రేటు
- బ్యాంక్ ఆఫ్ బరోడా – 8.15% ప్రారంభ వడ్డీ రేటు
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 8.15% ప్రారంభ వడ్డీ రేటు
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) – 8.25% ప్రారంభ వడ్డీ రేటు
ప్రాసెసింగ్ ఫీజు ఎంత?
హోం లోన్ తీసుకునే వారికి బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేస్తాయి. అయితే ఇది బ్యాంకును బట్టి మారవచ్చు.
Related News
- కొన్ని బ్యాంకులు లోన్ మొత్తంపై ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటాయి.
- మరికొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ అమౌంట్‌గా ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి.
- కొన్ని బ్యాంకులు హోం లోన్‌కు ప్రాసెసింగ్ ఫీజు కట్టించవు.
మీ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ లేదా బ్రాంచ్‌కి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఇప్పుడు హోం లోన్ తీసుకోకపోతే కల కలగానే మిగిలిపోతుంది
మీరు రూ. 50 లక్షల హౌస్ కొనాలనుకుంటే, హోం లోన్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు తీసుకోవడం మంచిది. ఇప్పుడే నిర్ణయం తీసుకోకపోతే, వడ్డీ రేట్లు పెరిగితే మీరు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి సంవత్సరాల తర్వాత పెరిగిన ధరకు ఇల్లు కొనాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే సరైన బ్యాంకును ఎంచుకుని హోం లోన్ తీసుకోండి.