అందరి దృష్టిలో ITR అంటే కేవలం టాక్స్ కట్టడానికి మాత్రమే అనుకుంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే, ITR మీకు ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. మీ ఆదాయం టాక్స్ పరిమితికి లోపలైనా, తప్పక ITR ఫైల్ చేయాలి.
ఎందుకంటే, మీరు రాబోయే రోజుల్లో లోన్ తీసుకోవాలనుకున్నా, విదేశీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నా, మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా – ITR మీకు అవసరం అవుతుంది..
ఇంకమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) ఫైల్ చెయ్యడానికి కేవలం కొద్ది నెలలే మిగిలి ఉన్నాయి. జూలై 31, 2025 లోగా మీరు తప్పక ITR ఫైల్ చేయాలి, లేదంటే పెద్ద మొత్తంలో లాభాలను కోల్పోతారు.