చాలా మంది రాత్రి ఆఫీసు నుండి ఆలస్యంగా ఇంటికి వెళ్లి 9 లేదా 10 గంటలకు భోజనం చేస్తారు. తర్వాత మళ్ళీ టీవీ చూస్తారు. సోషల్ మీడియా పోస్టులు, మొబైల్ స్క్రీన్‌పై ఎక్కువసేపు రీల్స్ చూస్తూ పడుకుంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇలా చేసే వారందరికీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అందుకే పట్టణీకరణ పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఈ ప్రాసెస్ చేసిన ఆహారాలు, డబ్బాల్లో ఉన్న ఆహారాలు, డబ్బాల్లో ఉన్న టమోటాలు, డబ్బాల్లో ఉన్న పండ్ల రసాలు కూడా చాలా ప్రమాదకరమని వైద్యులు కూడా అంటున్నారు. తాజా పండ్ల రసాలు, తాజా పండ్లు తినడం వల్ల క్యాన్సర్‌ను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.