హోమ్ లోన్ తీసుకున్నప్పుడ దానిని సులభంగా తిరిగి చెల్లించగలమని అనుకుంటాము. కానీ, తర్వాత ప్రతి నెలా EMI చెల్లించవలసి వచ్చినప్పుడు.. ఈ లోన్ ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా ఈఎంఐ ఇబ్బందుల నుంచి విముక్తి పొందాలనుకుంటారు. కానీ, హోమ్ లోన్ చెల్లించడం అంత ఇబ్బంది ఏం కాదు. ఇది అద్భుతమైన సదుపాయం. దాని ఇతర కోణాన్ని పరిశీలిస్తే.. గృహ రుణం తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందొచ్చు. హోమ్ లోన్‌పై అందుబాటులో ఉన్న 5 ప్రయోజనాలను మనం ఇపుడు చూద్దాం.
కస్టమర్ ఫ్రెండ్లీ లోన్
హోమ్ లోన్ గృహ మొదటి ప్రయోజనం ఏమిటంటే? ఇది కస్టమర్ ఫ్రెండ్లీ లోన్. ఇతర రుణాలతో పోలిస్తే గృహ రుణం తక్కువ. ఇందులో రీపేమెంట్ నిబంధనలు సులువుగా ఉంటాయి. కస్టమర్ రుణాన్ని ముందస్తుగా చెల్లించే లేదా ఫోర్‌క్లోజ్ చేసే సౌకర్యాన్ని పొందుతాడు. అయితే, భవిష్యత్తులో దీని వడ్డీ రేట్లను తగ్గించి మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Related News
ఆదాయపు పన్ను ఆదా
హోమ్ లోన్ పై రెండవ అతిపెద్ద ప్రయోజనం ఆదాయపు పన్ను. హోమ్ లోన్ సహాయంతో ప్రతి సంవత్సరం లక్షల రూపాయల పన్నును ఆదా చేయవచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి) కింద వడ్డీ చెల్లింపుపై ప్రతి ఆర్థిక సంవత్సరం రూ.2 లక్షల రాయితీ లభిస్తుంది. ప్రిన్సిపల్ అమౌంట్ రీపేమెంట్‌పై సెక్షన్ 80సి కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. మరోవైపు, సహ-దరఖాస్తుదారు సహాయంతో గృహ రుణం తీసుకున్నట్లయితే, దరఖాస్తుదారులు ఇద్దరూ వేర్వేరు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. దీంతో మొత్తం రూ. 7 లక్షల వరకు పన్నును ఆదా చేయవచ్చు.
ఆస్తి
హోమ్ లోన్ ఆమోదించే ముందు బ్యాంకులు ఆస్తిపై ఎలాంటి వివాదం లేవని నిర్ధారించడానికి దాని టైటిల్, రికార్డులను తనిఖీ చేస్తాయి. అవసరమైన అన్ని పత్రాలు చట్టపరమైన ధృవీకరణ ద్వారా ధృవీకరించబడతాయి. ఇది ఆస్తి మరెవరి ఆధీనంలో లేదని నిర్ధారిస్తుంది. ఇది ఇంటి కొనుగోలుదారుకు తాను కొనుగోలు చేస్తున్న ఆస్తి వివాదాస్పదంగా లేదని హామీ ఇస్తుంది.
టాప్-అప్ లోన్ సౌకర్యం
హోమ్ లోన్‌పై టాప్-అప్ లోన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. టాప్ అప్ హోమ్ లోన్ అనేది మీరు తక్కువ వడ్డీ రేట్లలో పొందే ఒక రకమైన పర్సనల్ లోన్. టాప్-అప్ హోమ్ లోన్‌ను తిరిగి చెల్లించడానికి మంచి సమయాన్ని కూడా పొందుతారు. ఎందుకంటే? దాని కాలపరిమితి మీ హోమ్ లోన్ కాలవ్యవధిపై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా.. ఇందులో ఎలాంటి హిడెన్ ఛార్జీలు లేవు.
మహిళా సహ-దరఖాస్తుదారుగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు
హోమ్ లోన్లో కూడా ఉమ్మడి రుణ సౌకర్యం అందుబాటులో ఉంది. గృహ రుణం కోసం సహ-దరఖాస్తుదారు మహిళ అయితే, కొంచెం తక్కువ ధరకే రుణాన్ని పొందుతారు. మహిళ సహ-దరఖాస్తుదారు అయితే అన్ని బ్యాంకులు .05 శాతం తక్కువ వడ్డీ రేటుతో రుణాలను అందిస్తాయి.