ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ (గురుకులం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 19 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (11వ తరగతి)లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన గిరిజన, ఇతర కేటగిరీ విద్యార్థులు మే 18వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ఉచిత విద్య, వసతి మరియు ప్రత్యేక శిక్షణ ఉంటుంది.
ప్రవేశ వివరాలు:
* ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఇంటర్మీడియట్ (11వ తరగతి) ప్రథమ సంవత్సరం ప్రవేశాలు
గ్రూప్, సీట్ల వివరాలు:
- ఇంటర్ MPC- 570;
- ఇంటర్ బైపీసీ- 570;
- HEP-570.
మొత్తం సీట్ల సంఖ్య: 1,710.
అర్హత: 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణత.
ఎంపిక ప్రక్రియ: 10వ తరగతి మార్కులు, రిజర్వేషన్ రూల్ ఆధారంగా.
Reservations in Admission:
In accordance with EMRS Guidelines November 2020 & duly approved Note for the Cabinet Committee on Economic Afairs (CCEA) vide Ministry of Tribal Afairs letter No. 17011/03/2019- EMRS (Part — I) dated 05.12.2021, the below mentioned reservation criteria shall be followed for granting admissions in EMRSs:-
ముఖ్యమైన తేదీలు…
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18-05-2024.
- మెరిట్ జాబితా విడుదల: మే 4వ వారం.
- కౌన్సెలింగ్ నిర్వహణ: జూన్ మొదటి వారం.
Detailed Notification of Gurukula Inter Admissions pdf here