
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నుండి ఎంతో మంది నిరుద్యోగులకు మంచి అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే ఈ ప్రతిష్టాత్మక విభాగం ఇప్పుడు ACIO-II/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3717 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. జీతం మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. స్థాయి 7 పే స్కేల్ ప్రకారం నెలకు కనీసం రూ.44,900 నుంచి గరిష్టంగా రూ.1,42,400 వరకు జీతం లభిస్తుంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ ఇతర అలవెన్సులు కూడా అందిస్తారు.
ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ ఇప్పటికే జూలై 14, 2025 న విడుదల అయ్యింది. ఇక ఆన్లైన్లో అప్లికేషన్ ప్రక్రియ జూలై 19, 2025 నుండి మొదలవుతుంది. అప్లై చేసేందుకు చివరి తేదీ మాత్రం ఆగస్టు 10, 2025. అంటే టైం చాలా తక్కువ. ఆసక్తిగల అభ్యర్థులు తక్షణమే తయారవ్వాలి. మీరు సరైన అర్హత కలిగివుంటే ఇప్పుడే అప్లై చేయడం మర్చిపోకండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మీ వయస్సు కనీసం 18 ఏళ్లుండాలి. గరిష్టంగా 27 ఏళ్లలోపే ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటగిరీలకు వయస్సు సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కోసం రూ.650. ఎస్సీ, ఎస్టీ, మహిళల కోసం మాత్రం రూ.550 మాత్రమే చెల్లించాలి. ఈ పోస్టుల కోసం ఎంపిక ప్రక్రియలో పలు దశలు ఉంటాయి. పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ను తప్పక చదవాలి. దరఖాస్తు ప్రక్రియ మాత్రం పూర్తిగా IB వెబ్సైట్ అయిన mha.gov.in ద్వారా ఆన్లైన్లోనే జరుగుతుంది.
[news_related_post]ఇప్పటికే చాలా మంది ఈ అవకాశాన్ని క్యాచ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. జీతం భారీగా ఉండటం, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసే గౌరవం ఉండటం వల్ల పోటీ కూడా తక్కువగా ఉండకపోవచ్చు. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోకండి. వెంటనే అప్లై చేయండి, లేకపోతే మిస్ అవుతారు.