గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ బుధవారం తన ఐఫోన్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత చౌకైన ఐఫోన్‌ను విడుదల చేసింది. కొత్త ఐఫోన్ 16 సిరీస్‌లో భాగంగా దీనికి 16E అని పేరు పెట్టారు. A18 చిప్‌తో విడుదలైన ఈ ఫోన్, ఇతర ఐఫోన్ సిరీస్‌ల మాదిరిగానే ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. తెలుపు, నలుపు రంగులలో ప్రారంభించబడిన ఇది 128GB, 256GB, 512GB వేరియంట్‌లలో లభిస్తుంది. దీని ధర రూ. 59,900 నుండి ప్రారంభమవుతుంది. ఐఫోన్ SE4 కోసం ప్రీ-ఆర్డర్‌లను ఫిబ్రవరి 21 నుండి తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సాధారణ అమ్మకాలు ఫిబ్రవరి 28 నుండి ప్రారంభమవుతాయి.
ఫీచర్ల విషయానికొస్తే.. అధునాతన గేమింగ్ ఫీచర్‌లను అందించడానికి దీనిలో 4-కోర్ GPU ఉపయోగించబడింది. అదనంగా మెషిన్ లెర్నింగ్ మోడల్ వేగంగా పని చేయడానికి చిప్ 16-కోర్ న్యూరల్ ఇంజిన్, ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు మద్దతు ఇస్తుంది. డిజైన్ పరంగా ఇది 4K వీడియోను కూడా సంగ్రహించే 48MP ఫ్యూజన్ కెమెరాతో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED ప్యానెల్‌ను కలిగి ఉంది. దీనికి యాక్షన్ బటన్ కూడా ఉంది. ఇది ఆపిల్ ఇంటెలిజెన్స్-పవర్డ్ విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది. 48 మెగాపిక్సెల్‌ల రిజల్యూషన్‌తో సింగిల్ రియర్ కెమెరాను కలిగి ఉన్న మొదటి ఐఫోన్ మోడల్ ఇదేనని కంపెనీ చెబుతోంది.